కాల్పుల విరమించుకున్నట్లు భారత్-పాక్ ప్రకటించి పట్టుమని నాలుగు గంటలు గడిచాయో..లేదో.. సరిహద్దుల్లో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్.. భారత్‌పై దాడులకు తెగబడింది. ఎల్‌వోసీలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మళ్లీ ప్రారంభమైంది..
న్యూఢిల్లీ, మే 10: కాల్పుల విరమించుకున్నట్లు భారత్-పాక్ ప్రకటించి పట్టుమని నాలుగు గంటలు గడిచాయో..లేదో.. సరిహద్దుల్లో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్.. భారత్‌పై దాడులకు తెగబడింది. ఎల్‌వోసీలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మళ్లీ ప్రారంభమైంది. బుద్ధి మార్చుకోని పాకిస్థాన్ కాల్పుల విరమణకు నీళ్లు వదిలేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కయ్యానికి కాలు దువ్వుతుంది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు మళ్లీ ప్రారంభమైనాయి. దీంతో జమ్ముకశ్మీర్‌లో బ్లాక్‌అవుట్ కొనసాగుతుంది. ఉదంపూర్, నౌషెరా, పూంఛ్, సుందర్‌బని, ఆర్నియా, రాజస్థాన్‌లోనూ.. బ్లాక్‌అవుట్ కొనసాగుతుంది.
భారత సైనిక పోస్టులే లక్ష్యంగా శనివారం రాత్రి 9 గంటల సమయంలో పాక్ ఉగ్ర మూక కాల్పులకు తెగబడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ ఆర్మీ దాడులను తిప్పికొట్టే పనిలో పడ్డాయి. ఉధంపూర్‌లో బ్లాక్‌అవుట్ మధ్య భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డగించాయి. దీంతో గగనతనంలో పేలుళ్ల శబ్దాలు మిన్నంటాయి.
ఒమర్ అబ్దుల్లా ట్వీట్..
శ్రీనగర్‌లో వరుసగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు. ఏం జరుగుతోంది.. ఇది కాల్పుల విరమణ కాదు. అంటూ ట్వీట్ చేశారు.
ఎల్‌వోసీలో మళ్లీ కాల్పులు ప్రారంభమైనాయి. శనివారం రాత్రి జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మిన్నంటింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో జమ్ముకశ్మీర్‌లో బ్లాక్‌అవుట్ కొనసాగుతుంది. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది. ఉదంపూర్, నౌషెరా, పూంఛ్, సుందర్‌బని, ఆర్నియా, కథువా సెక్టార్లలో కాల్పుల మోత, శ్రీనగర్‌లో వరుసగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ట్వీట్ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా భారత్ దెబ్బకు అల్లాడిపోయిన పాకిస్తాన్.. భారత్ దాడులు ఆపితే తాము కూడా దాడులు ఆపుతామని ప్రకటించింది. దీంతో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలకు సంధి కుదిర్చారు. దీంతో నేటి సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణనకు అంగీకారం తెలుపుతూ ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ వక్రబుద్ధి మార్చుకోని పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. మళ్లీ బోర్డర్ వెంబడి కాల్పులకు తెగబడటంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025