SGSTV NEWS
OperationSindoor

India Pak War Live: జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత

Updated on: May 09, 2025 | 10:21 PM జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నాయి. భయంతో పరుగులు తీస్తున్నారు. లైవ్ అప్ డేట్స్ తెలుసుకుందాం పదండి … India Pak War Live: కాల్పులకు తెగబడుతున్న పాక్‌ బలగాలు.. డ్రోన్ దాడిలో పలువురికి గాయాలు.? 09 May 2025 10:19 PM (IST) పాక్ డ్రోన్ దాడిలో పలువురికి గాయాలు.? సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. పంజాబ్ ఫిరోజ్‌పుర‌లో డ్రోన్ దాడిలో ఓ కుటుంబం గాయపడింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సరిహద్దుకు 100కిమీ దూరంలోని హొశియాపుర్‌లోనూ పేలుడు శబ్దాలు కలకలం రేపాయి. మరోవైపు జలంధర్‌లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది. 09 May 2025 10:17 PM (IST) భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు జమ్ముకశ్మీర్‌లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది

 


Updated on: May 09, 2025 | 9:52 PM
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను నేలకూలుస్తున్నాయి. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నాయి. భయంతో పరుగులు తీస్తున్నారు. లైవ్ అప్ డేట్స్ తెలుసుకుందాం పదండి …

09 May 2025 09:48 PM (IST)
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
గుజరాత్‌లోని హజీరా పోర్ట్ మీద దాడి జరిగింది. ఆ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదు. 2021 జులై 7న ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనను హజీరా పోస్ట్ పేరుతో పోస్ట్ చేశారు.

09 May 2025 09:48 PM (IST)

పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత్‌పై పాకిస్తాన్ మిస్సైల్స్ వర్షం కురిపించిందంటూ ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఓ గేమింగ్ వీడియోను పోస్ట్ చేసి.. భారత్‌పై భీకర దాడి అంటూ పోస్ట్ చేశారు.

09 May 2025 09:43 PM (IST)

భారత్ పాక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
— భారత్ పాక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

— చీకటి పడడంతో కాల్పులకు తెగబడుతున్న పాక్‌

— యూరీ, కుప్వారా, పూంఛ్‌, నౌగామ్‌ సెక్టార్లలో కాల్పులకు తెగబడుతున్న పాక్‌ బలగాలు

— జైసల్మేర్‌, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్‌ అవుట్‌

— పాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత బలగాలు

— జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌ సరిహద్దులో హై అలర్ట్

09 May 2025 09:02 PM (IST)

జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత
జమ్ము కశ్మీర్‌లో కాల్పుల మోత

డ్రోన్ దాడులకు పాక్ యత్నం

పలు ప్రాంతాల్లో మోగిన సైరన్లు

సాంబా సెక్టార్‌లో పాక్ డ్రోన్ల కూల్చివేత

జమ్మూలో డ్రోన్‌ పేల్చివేసిన భారత సైన్యం

పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయన్న ఒమర్‌ అబ్దుల్లా

09 May 2025 09:01 PM (IST)

భారత్ – పాక్ దాడులపై విపరీతంగా తప్పుడు ప్రచారం
ఆపరేషన్ సింధూర్‌తో చావుదెబ్బతిన్నపాకిస్తాన్‌ సోషల్ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేస్తోంది. పాకిస్తానన్‌లోని అధికారిక ఖాతాల నుంచి భారత్‌లోని సైనిక స్థావరాలపై చాలా చోట్లు దాడి చేసినట్లు నకిలీ వీడియోలు, ఫేక్‌ఫోటోలతో ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తోంది. పాక్‌ ఫేక్‌ ప్రచారానికి PIB ఫ్యాక్ట్స్‌తో చెక్ పెట్టింది.


09 May 2025 05:57 PM (IST)

పాక్‌ మాటలన్ని అబద్దం
ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని పాక్‌ చెప్పడం అబద్దమని, ప్రతి విషయంలో పాక్‌ అబద్దాలకు పాల్పడుతోందని విదేశాఖ శాఖ తెలిపింది. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిలయత్నాలు చేస్తోందన్నారు.

09 May 2025 05:55 PM (IST)

పాక్‌ తీవ్ర తప్పుడు ప్రచారం
మతం రంగు పూసేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోందని, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిలయత్నాలు చేస్తోందన్నారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ మూసేశామని తెలిపింది. పాక్‌ తీవ్రంగా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

09 May 2025 05:51 PM (IST)

పాక్‌ తప్పుడు ప్రచారం
ఎయిర్‌స్సేస్‌ మూసివేశామని పాకిస్తాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని కల్నల్‌ సోఫియా ఖురేషీ అన్నారు. ఎల్‌ఓసీ వెంబడి నిరంతరం పాక్ కాల్పులు జరుపుతోందని వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ అన్నారు. డ్రోన్‌ శిథిలాల పరిశీలన జరుగుతోందని, ఆ డ్రోన్లు టర్కీకి చెందిన సోన్‌గార్డ్‌వని తెలుస్తోందని అన్నారు.

09 May 2025 05:48 PM (IST)

పాక్‌ దాడులకు తిప్పికొడుతున్న భారత్‌
పాక్‌ భటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించిందని విదేశాఖ శాఖ తెలిపింది. పాక్‌ జరిపిన దాడులను భారత్‌ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని, దీంతో పాకిస్తాన్‌కు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. కరాచీ-లాహోర్‌ మధ్య విమానాలు తిరుగుతున్నాయని, భారత్‌ వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోందన్నారు.

09 May 2025 05:43 PM (IST)

పాక్‌కు తీవ్ర నష్టం
భారత సైనిక స్థావరాలపై పాక్‌ దాడికి యత్నిస్తోందని కల్నల్‌ సోఫియా ఖురేషీ తెలిపారు. కశ్మీర్‌లోని తంగ్దర్‌, యూరీలో పాక్‌ దాడులకు పాల్పడిందన్నారు. భారత్‌ జరిపిన దాడిలో పాక్‌కు తీవ్ర నష్టం కలిగిందన్నారు. పౌరవిమానాలను కవచంగా ఉపయోగించుకుని దాడి చేస్తోందన్నారు.

09 May 2025 05:38 PM (IST)

పాక్‌ దాడులు
కైనటిక్‌, నాన్‌ కైనటిక్‌ సాధనాలతో భారత్‌ తిప్పుకొట్టిందని, పశ్చిమ సరిహద్దు ప్రాంతాంలో పాక్‌ దాడులకు పాల్పడుతోందని విదేశాఖ శాఖ వెల్లడించింది. లేహ్‌ నుంచి సర్‌క్రీక్‌ వరకు 34 చోట్ల పాక్‌ దాడులకు పాల్పడిందని తెలిపింది.

09 May 2025 05:37 PM (IST)

కీలక సమావేశం
పాక్‌- భారత్‌ యుద్ధం నేపథ్యంలో విదేశాంగ శాఖ కీలక ప్రెస్‌మిట్‌ ఏర్పాటు చేసింది. ఆపరేషన్‌ సిందూర్ కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వెల్లడిస్తున్నారు అధికారులు.

09 May 2025 05:32 PM (IST)

ఏడుగురిని హతమార్చిన BSF జవాన్లు
పాక్‌-భారత్‌ యుద్ధం నేపథ్యంలో భారత బీఎస్‌ఎప్‌ జవాన్లు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చారు. భారత్‌పై 500 డ్రోన్లు ప్రయోగించిన పాక్‌.. టార్గెట్‌కు చేరుకోలేక కుదేలైపోయాయి. సియాచిన్ నుంచి భుజ్‌ వరకు దాడులకు ప్రయత్నించింది. పాక్‌తో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో బ్లాక్‌ఔట్‌ ప్రకటించింది భారత్‌.

09 May 2025 05:30 PM (IST)

ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షలు
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షలు కొనసాగుతున్నాయి. పాక్‌ దాడులను భారత్‌ తిప్పికొడుతోంది. త్రివిధదళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ చర్చలు కొనసాగిస్తున్నారు. భారత్‌లోకి పాక్‌ చొరబాటుదారులు చొచ్చుకువచ్చేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తున్నారు.

09 May 2025 04:59 PM (IST)

సరిహద్దు ప్రాంతాల టార్గెట్‌గా పాక్‌ దాడులు
భారత్‌-పాక్‌ వార్‌ కొనసాగుతోంది. సరిహద్దులో ఉండే ప్రాంతాల టార్గె్‌ట్‌గా పాకిస్తాన్‌ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లను ప్రయోగించడంతో భారత్‌ వాటిని గగనతలంలోనే పేల్చివేసింది.

09 May 2025 04:56 PM (IST)

బ్లాక్‌ఔట్‌
రాత్రిపూట దాడులకు పాక్‌ తెగబడుతుండటంతో హర్యానాలోని అంబాలాలో పూర్తి బ్లాక్‌ఔట్‌ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి లైట్లు వెలిగించరాదని హెచ్చరించింది.

09 May 2025 04:48 PM (IST)

ఎయిర్‌ రైడ్‌ సైరన్‌
ఢిల్లీలోని PWD ప్రధాన కార్యాలయంపై ఎయిర్‌ రైడ్‌ సైరన్‌ ఏర్పాటు చేశారు. దాన్ని టెస్ట్ కూడా చేశారు. వాటి పనితీరును ఢిల్లీ మంత్రి పర్వేశ్‌ వర్మ పరిశీలించారు. ఇలాంటి సైరన్లు ఢిల్లీ వ్యాప్తంగా మరో 50 ఏర్పాటు చేయనున్నారు. ఈ సైరన్‌ మోత దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది.

09 May 2025 04:02 PM (IST)

పాక్‌- భారత్‌ వార్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..
దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులకు స్థానం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులను మట్టుబెట్టారని, పాకిస్తాన్ దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోదీకి ఉందన్నారు చంద్రబాబు.

09 May 2025 03:18 PM (IST)

సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్‌గా పాక్‌ దాడులు
భారత్‌- పాకిస్తాన్‌ వార్‌ నేపథ్యంలో పాకిస్తాన్‌ సరిహద్దు రాష్ట్రాలే టార్గె్‌ట్‌గా దాడులకు తెగబడుతోంది. పాక్‌ దాడులతో రాజౌరీ భారీగా నష్టపోయింది. వాహనాలు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రాజౌరీ నుంచి వెళ్తున్న వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

09 May 2025 03:15 PM (IST)

ఏటీఎంల బంద్‌పై కేంద్ర క్లారిటీ
భారత్‌ – పాకిస్తాన్‌ ఉద్రక్తతల కారణంగా రకరకాల వదంతులు వెలువడుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. 2-3 రోజుల పాటు ఏటీఎంలు బంద్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఫేక్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచన చేసింది.

09 May 2025 02:55 PM (IST)

ఆయిల్‌ కంపెనీల కీలక ప్రకటన
భారత్‌ – పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నడుమ ఇండియన్‌ ఆయిల్‌ కీలక ప్రకటన. యుద్ధభయంతో ఎవరూ పెట్రోల్‌ కోసం పరుగులు తీయొద్దని సూచన చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయిల్‌ కంపెనీలు సూచించాయి.

09 May 2025 02:51 PM (IST)

విమాన ప్రయాణికులకు హెచ్చరిక
పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత విమానయాన సంస్థలు ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేశాయి. భద్రతా కారణాల రీత్యా ప్రయాణీకులు చెక్‌ ఇన్ కోసం మూడు గంటలు ముందుగానే ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాలని ఎయిర్ ఇండియా ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది.

09 May 2025 01:55 PM (IST)

ఆర్మీ చీఫ్‌కు స్పెషల్ పవర్స్
బోర్డర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం స్పెషల్ పవర్స్ ఇచ్చింది. అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని రెగ్యులర్‌ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని సైన్యాధిపతికి కల్పించింది. ఈ ఉద్రిక్త సమయంలో టెరిటోరియల్‌ సైన్యంలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు అనుమతులు జారీ చేసింది.

09 May 2025 01:01 PM (IST)

భారత్‌-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఆపరేషన్ సింధూర్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాక్‌ దాడులను భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దు రాష్ట్రాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాలోని పోలీస్, ప్రభుత్వ, వైద్య అధికారుల సెలవులు రద్దు చేశారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

పాక్‌ సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో పూర్తిగా యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్ము, రాజౌరీ, ఉధంపూర్, శ్రీనగర్‌ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. అక్కడ ప్రత్యేక నిఘా, బ్లాకౌట్‌లు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గుర్దాస్‌పూర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

– పాక్‌ దాడులతో యూరీ భారీగా నష్టపోయింది. పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు, దుకాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్కూళ్లు బంద్‌ అయ్యాయి. యూరీ నుంచి వెళ్తున్న, వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భద్రతా బలగాలు

09 May 2025 12:34 PM (IST)

యుద్ధభూమిలో తెలుగు జవాన్ వీర మరణం
India-Pakistan War Updates: జమ్ము కశ్మీర్‌లో జరిగిన‌ కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన వీరజవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పుల్లో గోరంట్ల మండలం తల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ స్వస్థలం గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయితీ కల్లి తండా.  యుద్ధభూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ డెడ్‌బాడీ శనివారం స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది

09 May 2025 12:12 PM (IST)

ఐపీఎల్‌ నిరవధిక వాయిదా
India-Pakistan News LIVE: పహల్గామ్ లో ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. నేపథ్యంలో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ  ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

09 May 2025 11:25 AM (IST)

పాకిస్థాన్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్న ఆకాశ్ క్షిపణి వ్యవస్థ
india attack on pakistan: భారత ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు  భారత ఆర్మీ ట్వీట్ చేసింది.  భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్‌ దాడులకు దిగినట్లు తెలిపింది. డ్రోన్లు, ఇతర పరికరాలతో పాక్ దాడులకు దిగినట్లు ఆర్మీ ట్వీట్ చేసింది. పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతోందని పేర్కొంది. దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

09 May 2025 10:49 AM (IST)

భారత్, పాక్ ఉద్రిక్తతలపై స్పందించిన చైనా
India-Pakistan War Updates– భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది — రెండూ ఒకరికొకరు పొరుగు దేశాలు, ఆ ఇద్దరూ చైనాకు పొరుగువారంటూ చైనా ప్రకటించింది — ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది — విస్తృత ప్రయోజనాల కోసం శాంతి మార్గం అనుసరించాలని సూచించింది — UN చార్టర్ సహా అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని వివరించింది — ఇరుదేశాలు ప్రశాంతంగా ఉండాలి, సంయమనం పాటించాలని చైనా సూచించింది — పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలంటోంది — ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి, నిర్మాణాత్మక పాత్ర పోషించానికి, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.

09 May 2025 10:07 AM (IST)

చండీగఢ్‌లో మోగిన సైరన్లు
India-Pakistan News LIVE: చండీగఢ్‌లో దాడులు జరగవచ్చని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌  హెచ్చరించింది. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని.. బాల్కనీల్లోకి కూడా రావొద్దని సూచించింది.జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యకు ప్రతిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట భారత్‌ గట్టి ఎదురుదెబ్బ తీసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి

09 May 2025 09:35 AM (IST)

త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమావేశం
India-Pakistan War News LIVE: త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమావేశమయ్యారు. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్థాన్‌ షెల్లింగ్‌, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు.

09 May 2025 08:53 AM (IST)

50 పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్
India-Pakistan War Updates: ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్లకు భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా,  ఉధంపూర్‌,  జమ్ము, నగ్రోటా, అఖ్నూర్‌, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా, వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చేవేసింది.

09 May 2025 08:35 AM (IST)

పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్
India-Pakistan War News LIVE: పాకిస్తాన్‌లో 7 కీలక ప్రాంతాలపై దాడులకు దిగింది భారత్. కరాచీ, ఇస్లామాబాద్‌, పెషావర్, లాహోర్‌లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది.  ఇందులో కరాచీ టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి.  కరాచీని ప్రత్యేకంగా టార్గెట్‌గా చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. పాకిస్తాన్‌ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది. పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన సీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది.  అందుకే పాకిస్తాన్‌కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది.

ఇప్పుడే కాదు 1971లోనూ కరాచీ టార్గెట్‌గా దాడులు జరిగాయి. 1971 డిసెంబర్ 4న అత్యంత సాహాసోపేతమైన దాడులకు దిగింది భారత్, దీన్ని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. అప్పట్లో INS నిపట్, INS నిర్ఘాత్ క్షిపణి పడవలను ఉపయోగించి చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 4న నేవీ డేగా జరుపుతుంది భారత్. 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్లీ ఇప్పుడే దాడి చేసింది.

09 May 2025 08:25 AM (IST)

భారత్, పాక్ మధ్య తాజా పరిస్థితులు దిగువ వీడియోలో చూడండి


09 May 2025 08:01 AM (IST)

పాక్ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన భారత్
పాక్ దాడులు చేస్తోంది.. భారత్ అంతకు మించిన వేగంతో తిప్పికొడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే.. సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది.  వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో -PIB క్లారిటీ ఇస్తోంది. గుజరాత్‌ హజీరా పోర్ట్‌పై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తప్పుడు సమాచారం అని PIB ప్రకటించింది. అది 2021 జులై 7న జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియో అంటూ PIB వివరించింది. సో హజీరా పోర్ట్‌పై దాడి జరిగలేదని PIB స్పష్టం చేసింది.

09 May 2025 07:46 AM (IST)

భారత్, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన
India-Pakistan News LIVE:

పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలపై అమెరికాఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కోరుకుంటోందన్నారు. మనం చేయగలిగేది ఏమిటంటే, ఈ దేశాలు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రోత్సహించడం. కానీ మనం వాళ్ల మధ్యలో జోక్యం చేసుకోబోము. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదు, దీన్ని అదుపు చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదు అని జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.

09 May 2025 07:30 AM (IST)

పాక్‌కు కాళరాత్రిని మిగిల్చిన భారత్
భారత్‌పై దాడులకు యత్నించిన పాక్‌కు కాళరాత్రే ఎదురయింది. పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలను భారత్ నేలమట్టం చేసింది. పాక్‌ ప్రయోగించిన 8 క్షిపణులను భారత్ నేలకూల్చింది. భారత్‌వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణశాఖ వెల్లడించింది. పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందించింది. భీకరమైన ఎదురుదాడులకు దిగింది పాక్‌లోని మరో రెండు వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. పంజాబ్‌ ప్రావిన్సులోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్‌ను ధ్వసం చేసింది.

09 May 2025 05:55 AM (IST)

భారత్‌కు స్పష్టంగా మద్దతు ఇవ్వాలి: పెంటగాన్ మాజీ అధికారి
భారతదేశానికి స్పష్టంగా మద్దతు ఇవ్వాలి: పెంటగాన్ మాజీ అధికారి

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలపై అమెరికా భారతదేశానికి స్పష్టంగా మద్దతు ఇవ్వాలని పెంటగాన్ మాజీ అధికారి, అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. లష్కరే తోయిబా వంటి వ్యక్తిగత ఉగ్రవాద సంస్థలను అమెరికా గతంలో గుర్తించిందని, కానీ పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా ప్రకటించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అమెరికా భారతదేశానికి మద్దతు ఇవ్వాలి. ఏ ప్రజాస్వామ్య నాయకుడి పని అయినా తన పౌరులను రక్షించడమే అని మైఖేల్ రూబిన్ స్పష్టం చేశారు.

09 May 2025 03:46 AM (IST)

DRDO అత్యవసర సమావేశం


పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో పాటు, చాందీపూర్ క్షిపణి శ్రేణి భద్రతను కూడా పెంచారు. ఇక్కడ నాలుగు స్థాయిల భద్రతను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట, ఒడిశా పోలీసులను మోహరించారు. తరువాత సైన్యం, తరువాత DRDO సొంత భద్రతా బృందం, చివరకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నాల్గవ స్థాయి భద్రతను అందిస్తున్నారు.

09 May 2025 03:45 AM (IST)

ఇద్దరి మధ్య చర్చలు జరగాలిః టర్కీ అధ్యక్షుడు
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చలు జరగాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అన్నారు. భారతదేశం – పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి క్షిపణి దాడులలో అనేక మంది పౌరులు మరణించిన తరువాత సంభావ్య సంఘర్షణ గురించి హెచ్చరించారు. “ప్రాణాలు కోల్పోయిన మా సోదరుల కోసం అల్లాహ్ దయ కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని చెబుతూ ఆయన పాకిస్తాన్‌కు సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ దాడిపై అంతర్జాతీయ దర్యాప్తు కోసం పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనకు ఎర్డోగన్ మద్దతు ఇచ్చారు.

09 May 2025 03:41 AM (IST)

యుద్ధం మధ్యలో మేము పాల్గొనబోంః జెడి వాన్స్
ప్రస్తుతం జరుగుతున్న భారత్-పాకిస్తాన్ వివాదం ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అన్నారు. ఈ పరిస్థితిపై అమెరికాకు పరిమిత నియంత్రణ మాత్రమే ఉందని అన్నారు. “మనం చేయగలిగేది ఏమిటంటే, ఇద్దరిని సంయమనం పాటించాలని సూచించడమే అన్నారు. కానీ ప్రాథమికంగా అమెరికాకు సంబంధం లేనిదన్నారు. అమెరికా నియంత్రించే సామర్థ్యంతో సంబంధం లేని యుద్ధం మధ్యలో మేము పాల్గొనబోమని వాన్స్ స్పష్టం చేశారు.

ఈ సమయంలో భారతీయులను ఆయుధాలు వదులుకోమని అమెరికా చెప్పలేదు. పాకిస్తానీలను ఆయుధాలు వదులుకోమని మేము చెప్పలేం. కాబట్టి, దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని కొనసాగిస్తామన్నారు జేడీ వాన్స్. ఇది విస్తృత ప్రాంతీయ యుద్ధంగా, అణు సంఘర్షణగా మారకూడదని మా ఆశ. ప్రస్తుతానికి, అది జరగబోదని అనుకుంటున్నామని అమెరికా ఉపాధ్యాక్షులు జేడీ వాన్స్ అన్నారు.

09 May 2025 03:37 AM (IST)

బహవల్‌నగర్ కంటోన్మెంట్ సమీపంలో పేలుళ్లు, కాల్పులు
బహవల్‌నగర్ కంటోన్మెంట్ సమీపంలో పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మసీదుల వద్ద ఇళ్లలోని లైట్లు ఆపివేయమని ప్రకటనలు వచ్చాయి. అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

09 May 2025 03:15 AM (IST)

చాంబ్, సియాల్‌కోట్‌లలో అత్యవసర పరిస్థితి
పాకిస్తాన్‌లోని చాంబ్, సియాల్‌కోట్ సెక్టార్లలో అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితి తలెత్తింది. ఈ ప్రాంత ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. పాకిస్తాన్‌లోని చాంబ్ సెక్టార్ జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌కు ఎదురుగా ఉంది. ఇది నియంత్రణ రేఖపై ఉంది. అదే సమయంలో, పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ సెక్టార్ కూడా అఖ్నూర్ సెక్టార్‌కు ఆనుకొని ఉంది. ఇది అంతర్జాతీయ సరిహద్దులో వస్తుంది.

09 May 2025 03:15 AM (IST)

ఇప్పటివరకు 10 మంది విదేశాంగ మంత్రులతో మాట్లాడిన జైశంకర్
ఆపరేషన్ సిందూర్ తర్వాత, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటివరకు 10 మంది విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి MBA అల్ థాని జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాతో మాట్లాడారు. దీనితో పాటు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఢిల్లీలో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్, జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్, స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెజ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చితో సమావేశమై మాట్లాడారు. అదే సమయంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధితో మాట్లాడారు. భారతదేశం ఇటలీ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రితో మాట్లాడారు.

09 May 2025 01:59 AM (IST)

ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్
పాకిస్తాన్ దాడిపై శుక్రవారం ఉదయం 10 గంటలకు సైన్యం, విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశం నిర్వహించనున్నాయి.

09 May 2025 01:57 AM (IST)

ISI కార్యాలయంపై దాడి
ISI కార్యాలయం నుండి పెద్ద వార్త వచ్చింది. లాహోర్‌లోని ఐఎస్‌ఐ ప్రధాన కార్యాలయంపై భారతదేశం దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

09 May 2025 01:48 AM (IST)

కరాచీలో ల్యాండైన టర్కిష్ కార్గో విమానం
పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో టర్కిష్ కార్గో విమానం ల్యాండ్ అయింది. జమ్మూలో డ్రోన్ దాడి తర్వాత, ఈ కార్గో విమానంలో టర్కిష్ డ్రోన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరాచీ విమానాశ్రయంలో టర్కిష్ కార్గో విమానం ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.

09 May 2025 01:47 AM (IST)

సాంబా సెక్టార్‌లో జైషే ఉగ్రవాదులు హతం
జమ్మూలోని సాంబా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని బిఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సమాచారం ప్రకారం, 10 నుండి 12 మంది జైషే ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు.

09 May 2025 01:45 AM (IST)

సంయమనం పాటించి,ఉద్రిక్తతలను తగ్గించాలిః యూఎన్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలేమోన్ యాంగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని, వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు. పౌరులు, మౌలిక సదుపాయాలపై జరిగిన అన్ని ఉగ్రవాద దాడులు, హింసను ఆయన ఖండించారు.

“ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంభాషణలు, దౌత్య పరిష్కారాలు మాత్రమే విభేదాలను పరిష్కరించడానికి, శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి ఏకైక మార్గాలని గట్టిగా నమ్ముతున్నాను” అని యాంగ్ అన్నారు.

09 May 2025 01:41 AM (IST)

పారిపోయిన పాకిస్థాన్ సైన్యం
బలూచిస్తాన్‌లో మూడింట ఒక వంతును స్వాధీనం చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. స్థానిక కథనాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ భూభాగాలకు ఆనుకుని ఉన్న పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్థాన్ సైన్యం పారిపోయిందని బీఎల్‌ఏ తెలిపింది.

09 May 2025 01:18 AM (IST)

2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్‌
భారత్‌ దాడులతో పాకిస్తాన్‌ అల్లాడుతుంది. పాక్‌లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసింది భారత్‌. సర్గోధా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించింది.

09 May 2025 01:17 AM (IST)

ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు
పాకిస్తాన్‌లోని పెషావర్‌, లాహోర్‌, కరాచీలో భారత్‌ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుంది. -పాక్‌ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై భారత నేవీ అధికారులు దాడి చేశారు. పాక్‌కు చెందిన మూడు ఫైటర్‌ జెట్స్‌తో పాటు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేశారు.

09 May 2025 01:16 AM (IST)

ఎయిర్‌పోర్టుల దగ్గర హైఅలర్ట్‌
దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల దగ్గర హైఅలర్ట్‌ ప్రకటించింది భారత రక్షణశాఖ . ఎయిర్‌పోర్టుల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచించింది.

09 May 2025 01:15 AM (IST)

సరిహద్దు ప్రాంతాల్లో మోగుతున్న సైరన్‌లు
భారత్‌పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్‌గా పాకిస్తాన్‌ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్‌, పంజాబ్‌ అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్‌, అఖ్నూర్‌లో సైరన్‌లు మోగాయి.

09 May 2025 01:02 AM (IST)

పీవోకేలో భీకర ఎదురుదాడి
పీవోకేలో భారతదేశం భారీ ప్రతీకార దాడిని ప్రారంభించింది. ఫిరంగి నుండి గుండ్లు దూసుకుపోతున్నాయి. అంతే కాకుండా, డ్రోన్లను ఉపయోగించి ఎదురుదాడి కూడా జరుగుతోంది. భారతదేశం ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది.

09 May 2025 12:59 AM (IST)

నౌషేరాలో పాక్ డ్రోన్ల కూల్చివేత
జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో రెండు పాకిస్తాన్ డ్రోన్‌లను భారత సైన్యం కూల్చివేసింది. ఆ సెక్టార్‌లో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.

09 May 2025 12:58 AM (IST)

ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణం
ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణ సలహా జారీ చేసింది. విమానాల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మారుతున్న గగనతల పరిస్థితులు, గట్టి భద్రత కారణంగా కొన్ని విమానాలు ప్రభావితమయ్యాయి. ప్రయాణీకుల సమాచారం కోసం వారి విమానయాన సంస్థను సంప్రదించాలని సూచించారు.

09 May 2025 12:55 AM (IST)

శాంతియుత పరిష్కారమే మార్గంః అమెరికా
జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ అనేక డ్రోన్,క్షిపణి దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

09 May 2025 12:30 AM (IST)

సాంబా సెక్టార్‌లో పాక్ కాల్పులు
జమ్మూలోని సాంబా సెక్టార్‌లో పాకిస్తాన్ వైపు నుండి భారీ కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి బిఎస్ఎఫ్ సైనికులు తగిన సమాధానం ఇస్తున్నారు. షకార్గ్, సియాల్‌కోట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిఎస్‌ఎఫ్ కాల్పులు జరుపుతోంది.

09 May 2025 12:11 AM (IST)

బలూచిస్తాన్‌లో పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. తరువాత అనేక పేలుళ్లు జరిగాయి.

09 May 2025 12:07 AM (IST)

ఇండియా గేట్ ఖాళీ చేయించిన అధికారులు
పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. దీని వలన సరిహద్దు అంతటా భయాందోళనలు, గందరగోళం నెలకొంది. భారతదేశం తన దేశ అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల కోసం కూడా బలమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఇండియా గేట్ చుట్టూ ఎవరూ ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపట్టింది.

08 May 2025 11:47 PM (IST)

యూరీలో యుద్ధ వాతావరణం
యూరీలో యుద్ధ వాతావరణం నెలకొంది. బాంబుల మోతలతో యూరీ ప్రాంతం దద్దరిల్లుతోంది. యూరీలో కాల్పులకు తెగబడుతుఉన్న పాకిస్తాన్‌ను భారత సైన్యం తిప్పికొడుతోంది. కాల్పులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లలోకి పరుగులు పెడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

08 May 2025 11:44 PM (IST)

కరాచీ ఓడరేవులో విధ్వంసం
భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీ ఓడరేవులో 8 నుండి 12 పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత అక్కడ బ్లాక్అవుట్ విధించారు. మొబైల్ సిగ్నల్ కూడా అంతరాయం కలిగింది.

08 May 2025 11:36 PM (IST)

మెంధార్ సెక్టార్‌లో బరితెగించిన పాక్
మెంధార్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.

08 May 2025 11:17 PM (IST)

కరాచీలో అర్డర్ కోసం ఎదురుచూస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్
పశ్చిమ నావల్ కమాండ్ రంగంలోకి దిగింది. కరాచీ సమీపంలో INS విక్రాంత్, కోల్‌కతా తరగతి డిస్ట్రాయర్లు యుద్ధనౌకలలో సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర వ్యవస్థ నుండి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్షణానైనా ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలుస్తోంది.

08 May 2025 11:15 PM (IST)

8 వేలకు పైగా X ఖాతాలు బ్లాక్
భారతదేశం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ట్విట్టర్ (X) ఖాతాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం ఎనిమిది వేలకు పైగా ట్విట్టర్ ఖాతాలను మూసివేయాలని ఆదేశించింది.

08 May 2025 11:14 PM (IST)

దేశంలోని 27 విమానాశ్రయాలు మూసివేత
పాకిస్తాన్ దాడి ప్రయత్నాలు విఫలమవడంతో భారతదేశంలోని 27 విమానాశ్రయాలు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా , సిమ్లా, కులు ఉన్నాయి.

08 May 2025 11:12 PM (IST)

పాకిస్తాన్‌ పైలట్‌ పట్టివేత
పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది భారత్. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేసింది. తాజాగా జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాకిస్థాన్‌‌కు చెందిన F- 16 పైలట్‌ను భారత్ పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది.

08 May 2025 11:00 PM (IST)

పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటన
భారత ప్రతీకార దాడుల్లో రెండు JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. భావోద్వేగంగా తీవ్రమైన నష్టం అంటూ పాకిస్తాన్‌ ప్రకటన చేసింది. ఈ ఘటనలో కొందరు జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్‌ తెలిపింది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాక్‌ ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తోంది.

08 May 2025 10:58 PM (IST)

భారత రక్షణ శాఖ కీలక ప్రకటన
జమ్ము, పఠాన్‌కోట్‌, ఉధంపూర్‌ సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ దాడులకు తెగబడిందని రక్షణ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పాక్‌ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది. ఈరోజు పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఎటువంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.

08 May 2025 10:54 PM (IST)

కచ్‌లో 3 పాక్ డ్రోన్‌లను కూల్చేసిన భారత్
గుజరాత్‌లోని కచ్ సరిహద్దులో ఆరు పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. ఈ డ్రోన్లు గత 3 గంటలుగా కనిపిస్తున్నాయి. వీటిలో 3 డ్రోన్లను కూల్చివేసి, మూడు ఇప్పటికీ ఎగురుతున్నాయి.

08 May 2025 10:53 PM (IST)

పారామిలిటరీ దళాల డీజీకి అమిత్ షా ఫోన్
పాకిస్తాన్ పై ప్రతీకార చర్య మధ్య, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారామిలిటరీ దళాల డీజీతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

08 May 2025 10:52 PM (IST)

జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాలలు మూసివేత
జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, 12వ తరగతి వరకు పాఠశాలల్లో తరగతులు శుక్రవారం నిలిపివేయడం జరుగుతుందని విద్యా మంత్రి సకినా ఇట్టూ తెలిపారు. కాశ్మీర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (IUST) లో కూడా తరగతులను వాయిదా వేశాయి.

08 May 2025 10:50 PM (IST)

పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ధ్వంసం
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్తాన్ వణికిపోతుంది. అత్యంత నవీకరించిన వైమానిక హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ (AWACS) ను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ నిఘా, యుద్ధ నియంత్రణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.

08 May 2025 10:47 PM (IST)

పాకిస్థాన్‌కు మొదలైన కౌంట్ డౌన్!
పాకిస్తాన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. భారతదేశం ఎదురుదాడిని ప్రారంభించింది. లాహోర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్, బహవల్‌పూర్‌లలో వేగవంతమైన దాడులను భారతీ ఆర్మీ ప్రారంభించింది.

08 May 2025 10:45 PM (IST)

జైశంకర్‌తో మాట్లాడిన ఈయూ
పాకిస్తాన్ దాడుల ప్రయత్నాల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యూరోపియన్ యూనియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారతదేశం తన చర్యలలో సంయమనం పాటించిందని ఆయన అన్నారు. అయితే, పాకిస్తాన్ వైపు నుండి ఉద్రిక్తత పెరిగితే తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుందని జైశంకర్ స్పష్టం చేశారు.

08 May 2025 10:39 PM (IST)

వణికిపోతున్న పాకిస్తాన్‌
భారతదేశం ఎదురుదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్పూర్‌లలో సైరన్‌లు మోగుతున్నాయి.

08 May 2025 10:38 PM (IST)

రంగంలోకి దిగిన భారత నావికాదళం
పాకిస్తాన్‌పై భారత సైన్యం ప్రతీకార చర్య తీసుకుంటున్న సమయంలో, భారత నావికాదళం కూడా రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌కు ప్రతిస్పందించడానికి భారత నావికాదళ పశ్చిమ కమాండ్ చేరాలని యోచిస్తోంది.

08 May 2025 10:36 PM (IST)

జైశంకర్‌కు అమెరికా విదేశాంగ మంత్రి
భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన మధ్య, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో మాట్లాడారు. వెంటనే ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. భారత్-పాక్ మధ్య ప్రత్యక్ష సంభాషణకు అమెరికా మద్దతును ఆయన వ్యక్తం చేశారు. కాగా పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని రూబియో ఇదివరకే ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటించారు. కాగా, భారతదేశం తన చర్యలలో సంయమనం పాటించిందని జైశంకర్ అన్నారు. అయితే, పాకిస్తాన్ వైపు నుండి ఉద్రిక్తత పెరిగితే తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నారు.

08 May 2025 10:32 PM (IST)

రాజస్థాన్‌లో పాకిస్తాన్ దాడికి యత్నం
రాజస్థాన్‌లో దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. జైసల్మేర్‌లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ 30 పాకిస్తానీ క్షిపణులను కూల్చివేసింది.

08 May 2025 10:30 PM (IST)

ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ
పాకిస్తాన్ దుశ్చర్య తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ మధ్య సమావేశం జరుగుతోందని విశ్వనీయవర్గాల సమాచారం.

08 May 2025 10:29 PM (IST)

లాహోర్‌‌పై భారత్ దాడులు
పాకిస్తాన్ ఇప్పుడు ఏదైనా చేయడానికి ధైర్యం చేస్తే, దానికి తగిన సమాధానం లభిస్తుందని భారతదేశం కొన్ని గంటల క్రితం చెప్పింది. అయినప్పటికీ, పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించింది. దానిని విఫలమైన తరువాత, భారతదేశం ఇప్పుడు ప్రతీకార చర్యను ప్రారంభించింది. భారతదేశం చర్య తర్వాత లాహోర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

08 May 2025 10:26 PM (IST)

రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర భేటీ
మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ దుష్ట కార్యకలాపాల మధ్య, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశమైంది. రాజ్‌నాథ్ సింగ్ తోపాటు CDS, త్రివిధ సైన్యాల అధిపతులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

08 May 2025 10:25 PM (IST)

ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పాకిస్తాన్ దుష్ట కార్యకలాపాల మధ్య, పంజాబ్ ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రజల సౌలభ్యం కోసం 0172-2741803, 0172-2749901 ఫోన్ నంబర్లను జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

08 May 2025 10:24 PM (IST)

పాకిస్తాన్ దాడి విఫలం
జమ్మూ కాశ్మీర్‌లోని సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లలో పాకిస్తాన్ 8 క్షిపణులను ప్రయోగించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.

08 May 2025 10:23 PM (IST)

జమ్మూ పోలీసుల హెచ్చరిక
జమ్మూ పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇంటి లోపల, సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని స్థానికులకు సూచించారు. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పుకార్లు, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని పోలీసులు సూచించారు. ఇది ఆందోళనకు కారణమవుతుందన్నారు.

08 May 2025 10:21 PM (IST)

జమ్మూలో పాక్ డ్రోన్ల కూల్చివేత
జమ్మూలోని సత్వారీ విమానాశ్రయం, జమ్మూ విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను యాంటీ-డ్రోన్ వ్యవస్థ కూల్చివేసింది.

08 May 2025 10:20 PM (IST)

అధికారుల సెలవులు రద్దు
యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అధికారుల సెలవులను రద్దు చేసింది.

08 May 2025 10:19 PM (IST)

పాక్ డ్రోన్‌లను ధ్వంసం చేసిన భారత్
వాయు రక్షణ వ్యవస్థలు, వాయు రక్షణ తుపాకులు అనేక డ్రోన్‌లను కూల్చివేసాయి. జమ్మూ, జైసల్మేర్, అమృత్‌సర్‌లపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. వాయు రక్షణ వ్యవస్థతో పాటు, వాయు రక్షణ తుపాకులు జమ్మూలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌లను కూడా ధ్వంసం చేశాయి.

08 May 2025 10:18 PM (IST)

పాకిస్తాన్ ఫ్లాన్ ధ్వంసం
రాజౌరి, పూంచ్ లలో పాకిస్తాన్ ప్రణాళికలు ధ్వంసం చేసిన భారత ఆర్మీ. రాజౌరి, పూంచ్ లపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను భారతదేశం విఫలం చేసింది.

08 May 2025 10:17 PM (IST)

జమ్మూలో దాడికి యత్నించి పాక్
జమ్మూలోని ఆర్నియా సెక్టార్‌లోని ఆర్‌ఎస్ పురాలో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది, దీనిని భారతదేశం విఫలం చేసింది.

08 May 2025 10:16 PM (IST)

దుష్ట కుట్రలను నాశనం చేసిన సుదర్శన చక్రం
భారతదేశ రక్షణ కవచం S-400 మరోసారి పాకిస్తాన్‌కు గగనతలంలో గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ కు చెందిన 8 క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది.
08 May 2025 10:14 PM (IST)

కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు
ఉగ్రవాదం అంతమయ్యే వరకు చర్చల ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది భారత్. అసత్య ప్రచారాలు అసలే నమ్మొద్దని ప్రజలకు సూచించింది. మరోవైపు LOC దగ్గర పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. జమ్ము, కుప్వారా, బారాముల్లా, యురి, పూంచ్‌, మెందార్‌, రాజౌరి సెక్టార్లలో పాక్‌ అమాయక ప్రజలపై కాల్పులకి తెగబడుతోంది. మోర్టార్లు, భారీ శతఘ్నులతో దాడులు చేస్తోంది. దాయాది దాడులు చేస్తున్న క్రమంలోనే భారత్ ప్రతిదాడులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

08 May 2025 10:13 PM (IST)

దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్
పాక్ సైనికులు డ్రోన్లు, మిస్సైళ్లతో ఎటాక్ చేశారు. ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ UAS గ్రిడ్‌, వైమానిక రక్షణ వ్యవస్థలతో దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. మిసైల్ శకలాలను స్వాధీనం చేసుకున్నాం. పాకి దాడి చేసిందనడానికి అవే ఆధారం

08 May 2025 10:13 PM (IST)

రావల్పిండిపై డ్రోన్‌ దాడులు
పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై డ్రోన్‌ దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం దగ్గర ఓ డ్రోన్ కూలిపోయింది. దీంతో ఓ రెస్టారెంట్‌తో పాటు స్డేడియం దెబ్బతింది. పాక్ కవ్వింపు చర్యలకి ఆధారాలు ఉన్నాయని.. మళ్లీ రిపీట్ అయితే ప్రతిదాడులు వేరే లెవెల్‌లో ఉంటాయని హెచ్చరించింది భారత్‌.

08 May 2025 10:12 PM (IST)

10 ప్రాంతాల్లో ఎటాక్
పాక్ దాడులతో భారత్ ప్రతిదాడులు మొదలెట్టింది. మొత్తం 10 ప్రాంతాల్లో ఎటాక్ చేసింది. అటోక్‌, రావల్పిండి, చక్వల్‌, గుజ్రన్‌వాలా, లాహోర్‌, వాల్టన్, బవహల్పూర్‌, మెహమూనా, కరాచి, చోర్‌ ఏరియాల్లో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయి భారత బలగాలు.

08 May 2025 10:12 PM (IST)

గనతంలోనే పేల్చేసిన S-400
శ్రీనగర్‌, అవంతిపొర, జమ్ము, పటాన్‌కోట్‌, అమృత్‌సర్‌, కపుర్తలా, జలంధర్‌, చండీగఢ్‌, లుథియానా, భటిండా, అదంపుర్‌, నల్ బికనీర్‌, ఫలోడి, ఉత్తర్‌లాయ్‌, భుజ్‌ ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. ఆ దాడుల్ని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ మిసైళ్లను S-400తో గగనతంలోనే పేల్చేశాయి.

08 May 2025 10:11 PM (IST)

ప్రధాన నగరాల్లో దాడులకు ప్లాన్
పహెల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. దీనికి కడుపుమంటతో రగిలిపోయిన దాయాది.. భారత్‌లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్లాన్ చేసింది.

08 May 2025 10:10 PM (IST)

సైనిక స్థావరాలే టార్గెట్‌గా పాక్ దాడులు
యుద్ధం వద్దని భారత్ సంయమనం పాటిస్తుంటే.. దాయాది పాక్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా దాడులకి ప్లాన్ చేసింది. పాక్ కుయుక్తులపై కన్నేసి ఉంచిన భారత్.. ప్రతిదాడులతో విరుచుకుపడింది. దీటైన జవాబిచ్చింది. అంతేకాదూ.. తెగబడితే తిరగబడతామని డ్రోన్ ఎటాక్‌లతో హెచ్చరించింది.

జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. భారత సైన్యం చాలా యాక్టివ్‌గా ప్రత్యర్థి డ్రోన్లు, రాకెట్లను కూల్చేస్తోంది. జమ్ము నగరం మొత్తం విద్యుత్‌ అంతరాయం కలిగింది. శత్రు సేనల నుంచి వస్తున్న డ్రోన్లను ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సాయంతో కూల్చేస్తున్నారు. కొన్ని రాకెట్లను కూడా కూల్చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్‌పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్‌గా పాకిస్తాన్‌ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్‌, పంజాబ్‌ అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్‌, అఖ్నూర్‌లో సైరన్‌లు మోగాయి.

పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది. 10 పాక్‌ డ్రోన్లను S400తో పేల్చేసింది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను కూడా పాక్‌ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా.. పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీడ్రోన్‌ సిస్టమ్‌తో పాక్‌ డ్రోన్లను కూల్చివేశారు.

సాంబా సెక్టార్‌లోనూ పాక్‌ దాడులకు తెగబడింది. అయితే పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పూంచ్‌, కుప్వారా, సాంబా సెక్టార్‌లో భీకరంగా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్ము వర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను భారత్‌ కూల్చివేసింది

Related posts

Share this