SGSTV NEWS
CrimeNational

క్యాష్, గోల్డ్, సిల్వర్ ఓకే భయ్యా..! అన్ని టన్నుల తేనె ఎందుకు చెప్మా..!

 

గుట్టలా నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ గోల్డ్‌, సిల్వర్‌, విశాల, ప్రశాంత ఫామ్‌హౌస్‌.. అందులో ఏకంగా చెరువు.. దగ్గర దగ్గర 50 విల్లా కాటేజీలు.. అపరకుబేరులకు మాత్రమే సాధ్యమయ్యే సెటప్..! కానీ కళ్లు చెదిరే ఆ ఆస్తులకు ఓనర్‌ ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌. అక్రమాస్తుల కేసులో కూపీలాగితే 17 టన్నుల తేనెతో పాటు కోట్లలో సారూ వారి అవినీతి సామ్రాజ్యం బయటపడింది.


గుట్టలా నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ గోల్డ్‌, సిల్వర్‌, విశాల, ప్రశాంత ఫామ్‌హౌస్‌.. అందులో ఏకంగా చెరువు.. దగ్గర దగ్గర 50 విల్లా కాటేజీలు.. అపరకుబేరులకు మాత్రమే సాధ్యమయ్యే సెటప్..! కానీ కళ్లు చెదిరే ఆ ఆస్తులకు ఓనర్‌ ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌. అక్రమాస్తుల కేసులో కూపీలాగితే 17 టన్నుల తేనెతో పాటు కోట్లలో సారూ వారి అవినీతి సామ్రాజ్యం బయటపడింది

తింటాడా? తాగుతాడా? లేదంటే తలంటుకుంటాడా? ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఫామ్‌హౌస్ 17 టన్నుల తేనే స్టాక్‌ చూసి, ఆఫీసర్లు షాకయ్యారు. మధ్యప్రదేశ్‌‌లో గోవింద్‌ ప్రసాద్‌ మెహ్రా అనే రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన లోకాయుక్త టీమ్‌కు అనూహ్యమైన సీన్‌ ఎదురైంది. సోదాల్లో సదరు సారు వారి ఇంట్లో నోట్ల కట్టలు, భారీగా నగలు, డాక్యుమెంట్స్‌ దొరికాయి. అవన్నీ ఒక ఎత్తు. సార్వారి ఫామ్‌ హౌస్‌లో దొరికిన 17 టన్నుల తేనె మరో ఎత్తు. హనీ కే పీఛే.. కహానీ క్యా హై? అనేది ఆఫీసర్లకు ఓ పజిల్‌గా మారింది.

తియ్యతియ్యని మాటలతో ఎంత మందికి కుచ్చుటోపి పెట్టాడో? పవర్‌ను అడ్డం పెట్టుకుని ఏ రేంజ్‌లో ఆమ్యామ్యాలు దండుకున్నాడో కానీ, మధ్యప్రదేశ్‌ PWD రిటైర్డ్‌ ఇంజినీర్‌ గోవింద్‌ ప్రసాద్‌ భారీగా ఆస్తులు కూడపెట్టాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో భోపాల్‌, నర్మాదాపురంలోని ఆయన ఇళ్లలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు లోకాయుక్త అధికారులు. భారీగా నగదు, 2కేజీల బంగారు నగలు, ఆరు కేజీల వెండి ఫిక్స్ డిపాజిట్ దస్త్రాలు దొరికాయి.

నర్మాదాపురంలో మెహ్రాకు ఓ ఫామ్‌ హౌస్‌ ఉన్నట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లి చూస్తే..కళ్లు బైర్లు కమ్మే సంచలనాలు తళుక్కుమన్నాయి. ఒకటి కాదు ఏకంగా 32 కాటేజీలో అండర్‌ కన్‌స్ట్రక్షనక్షలో ఉన్నాయి. అల్రెడీ ఏడు కాటేజీలు కంప్లీటయ్యాయి. ఫామ్‌ హౌస్‌లో ఏకంగా ఓ చెరువునే ఏర్పాటు చేసుకున్నారు. నాలుగైదు లగ్జరీ కార్లు పార్క్‌ చేసి ఉన్నాయి. అవన్నీ ఒక లెక్క. ఫామ్‌హౌస్‌లో స్టోర్‌ చేసిన 17 టన్నుల తేనే మరో లెక్క. హనీ కే పీచే కహానీ ఏంటో క్లూ చిక్కింది. లాభసాటి వ్యాపారమని అక్రమంగా తేనే ఉత్పత్తి చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.




గోవింద్‌ ఫామ్‌హౌస్‌లో వెలుగు చూసింది ఆర్గానిక్‌ తేనేనా? లేదంటే ప్రజారోగ్యానికి హానీ కల్గించే Sకెమికల్ తేనేను తయారు చేస్తున్నారా? అనే కోణంలో కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం గోవింద్‌ ప్రసాద్‌ మెహ్రా అక్రమాస్తుల లెక్క వందల కోట్ల మార్క్‌ను దాటేసింది. అతని బినామీలపై లోకాయుక్త అధికారులు ఫోకస్‌ పెట్టారు. చూడబోతే మరిన్ని సంచనాలు క్యూ కట్టడం ఖాయం ఉందంటున్నారు అధికారులు

Also read

Related posts