దేశవ్యాప్తంగా రైళ్ల పేల్చివేత కుట్ర మరోసారి బయటపడింది. మధ్యప్రదేశ్ లోని సగ్‌పాటా రైల్వేస్టేషన్ దగ్గర ట్రాక్‌పై 10 డిటనేటర్లు లభించడం తీవ్ర కలకలం రేపింది. జమ్ము కశ్మీర్ నుంచి కర్నాటకకు వస్తున్న ఆర్మీ ట్రైన్‌కు పెను ముప్పు తప్పింది. ట్రాక్‌పై డిటనేటర్లను గమనించిన లోక్ ఫైలట్ వెంటనే రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో మరో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను చూసిన గూడ్సు రైలు డ్రైవర్ వెంటనే ఆపేశాడు.. కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఈ గూడ్స్ రైలు వెళ్తుండగా ప్రమాదం తప్పింది. ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్ నెలరోజుల్లో రెండోసారి ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితమే బివాని నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న రైలుకు పెనుప్రమాదం తప్పింది. ట్రాక్‌పై సిలిండర్ ఉండడంతో ట్రైన్‌ను ఆపేశాడు కాళింది ఎక్స్‌ప్రెస్ డ్రైవర్.
ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో రైలు ప్రమాదానికి పన్నిన కుట్ర భగ్నమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ వెనుక నైనీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తున్న ట్రాక్‌పై పాత 7 మీటర్ల పొడవైన టెలికాం స్తంభాన్ని ఉంచారు దుండగులు. ఇంతలో డెహ్రాడూన్ (డూన్) ఎక్స్‌ప్రెస్ అక్కడి నుండి వెళుతోంది. రైల్వే ట్రాక్‌పై స్తంభాన్ని చూసిన రైలు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై స్తంభం ఉన్నట్టు సమాచారం అందుకున్న జీఆర్‌పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై ఉన్న పిల్లర్‌ను అధికారులు తొలగించారు. ఆ తర్వాత రైలు ముందుకు సాగింది. అంతకుముందు ఘాజీపూర్‌లో రైల్వే ట్రాక్‌పై పెద్ద చెక్క దిమ్మెను ఉంచారు. ఫ్రీడమ్ ఫైటర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టింది. అయితే రైలు పట్టాలు తప్పకుండా లోకో ఫైలట్ కాపాడారు. ఈ వరుస ఘటనలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైళ్ల పేల్చివేత కుట్రలపై NIA దర్యాప్తు చేపట్టింది
Also read
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..
- బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
- Hyderabad : మరో అమ్మాయితో లవర్ కి పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!