అవినీతి ఆరోపణలతో అసోంలోని ఓ ఉన్నాతాధికారి ఇంట్లో సోదాలు చేస్తే.. ఏకంగా రెండు బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అవినీతి తిమింగలం పోలీసులకు చిక్కిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అవినీతి ఆరోపణలతో ACS అధికారి నూపుర్ బోరా ఇంట్లో సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారులు సోదాలు నిర్వహించారు.
అవినీతి ఆరోపణలతో అసోంలోని ఓ ఉన్నాతాధికారి ఇంట్లో సోదాలు చేస్తే.. ఏకంగా రెండు బ్యాగుల నిండా ఉన్న నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అవినీతి తిమింగలం పోలీసులకు చిక్కిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అవినీతి ఆరోపణలతో ACS అధికారి నూపుర్ బోరా ఇంట్లో సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు దొరికాయి.. రూ.90లక్షల నగదు, కోటి విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ACS అధికారి నూపుర్ బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులపై ఆరా తీస్తున్నారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసెస్‌లో చేరిన నూపుర్ బోరా.. ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలడంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు పోలీసులు. అలాగే బార్పేట్‌లో ఆమెకుతో కలిసి పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా.. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.. దాదాపు రూ.2 కోట్ల వరకు సీజ్ చేసినట్లు చెబుతున్నారు.
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





