మణికొండ: కిరాణ దుకాణానికి వెళ్లి ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమెపై ఓ యువకుడు బకెట్‌తో నీళ్లు పోసి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఇదేమిటని అడిగినందుకు సదరు యువతి తండ్రి గొంతు కోసేందుకు ప్రయతి్నంచగా అడ్డుకున్న అతడి భార్య చేతికి గాయామైంది. నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి, కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెమలినగర్‌లోని జేఎన్‌ఎన్‌ఆర్‌ఎంయు క్వార్టర్స్‌లో రాముడు కుటుంబంతో కలిసి నివాస ం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు జులాయిగా తిరిగేవాడు. ఆదివారం మధ్యాహ్నం రాముడి కుమార్తె కిరాణా సరుకులు తెచ్చుకునేందుకు సమీపంలో ఉన్న అశోక్ కిరాణ షాప్‌కు వెళ్లింది.
అదే సమయంలో అక్కడికి వచి్చన సురేష్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమేగాక పక్కనే బకెట్‌లో ఉన్న నీటిని ఆమెపై పోశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పడంతో ఆమె తండ్రి రాముడు కాలనీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై మాట్లాడుతుండగా సురేష్ తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్, మరికొందరితో కలిసి అక్కడికి వచ్చి మమ్మల్నే నిలదీస్తారా అంటూ కత్తితో రాముడిపై దాడికి దిగారు. అడ్డుకునేందుకు వెళ్లిన రాముడు భార్య చేతికి గాయమైంది. దీనిపై సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఇరు వర్గాలకు సరి్ధచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాముడు ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే