రంగారెడ్డి: ‘నా భర్త నాకు కావాలి.. నా పిల్లలు నాకు కావాలి.. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఓ మహిళ.. భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన సోమ వారం తుర్కయంజాల్‌లో చోటు చేసుకుంది. వివరా లు ఇలా ఉన్నాయి.. నాగార్జునసాగర్‌కు చెందిన రంగనాథ్‌నాయక్ మెదక్ ఏఆర్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2007లో మిర్యాలగూడకు చెందిన జత్లావత్ జ్యోతితో ఇతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలుండగా ప్రస్తుతం హాస్టల్‌లో చదువుకుంటున్నారు. 2018నుంచి తుర్కయంజాల్‌లో నివాసం ఉంటున్న రంగనాథ్ దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్థలతో 2021నుంచి గొడవలు జరుగుతున్నాయి.
గతేడాది నవంబర్‌లో పుట్టింటికి వెళ్లిన జ్యోతి నల్లగొండ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తుర్కయంజాల్ చేరుకున్న జ్యోతి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. రంగనాథ్‌నాయక్ ఆమెను అడ్డుకోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. అనంతరం 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఆదిబట్ల పోలీసులు రంగనాథ్‌తో చర్చించారు. దీంతో ఆయన భార్యను ఇంట్లోకి అనుమతించారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, విడాకులు ఇవ్వాలంటూ వేధిస్తున్నాడని జ్యోతి ఆరోపించింది
Also read
- Andhra: బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా.. రెండుసార్లు మెరిసిన ఫ్లాష్‌లైట్…. M
- Telangana: భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..
- Crime: తల్లికి వందనం డబ్బులతో తాగేశాడని… మద్యంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య
- Hyderabad: భార్య వేధింపులకు నవ వరుడు మృతి.. హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య!
- గుంటూరు: రూ. 7 లక్షల అప్పు.. నాలుగు రూపాయల వడ్డీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే