SGSTV NEWS online
Crime

IIT BABA: గంజాయి పవిత్రమైన ప్రసాదం.. IIT బాబా మరో సంచలనం!


కుంభమేళా పాపులర్ IIT బాబా మరోసారి సంచలన కామెంట్స్‌ చేశాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి మోతాదు తక్కువేనని వదిలేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చి ‘గంజాయి ప్రసాదం’ అంటూ దుమారం రేపాడు.
.IIT BABA: కుంభమేళాలో భారీగా పాపులర్ అయిన IIT బాబా మరో సంచలన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచాడు. అతడి దగ్గర గంజాయి లభించడంతో NDPS చట్టం కింద కేసు నమోదు చేసి రాజస్థాన్ జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మోతాదు తక్కువగా ఉండటంతో  విచారించి వదిలేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయకొచ్చిన బాబా.. గంజాయి ‘పవిత్రమైన ప్రసాదం’ అంటూ మరోసారి సంచలనం రేపాడు.  దీంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది
.నేను ముందుగానే చెబుతున్నా..
ఇదిలా ఉంటే.. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పై పాకిస్థాన్ గెలుస్తుందంటూ జోష్యం చెప్పడంతో క్రికెట్ లవర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాబాపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి దేశ ద్రోహిని పాక్ పంపించాలంటూ డిమాండ్ చేశారు. IIT బాబాగా పిలవబడే అభయ్ సింగ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో జరగబోయే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ‘పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారతదేశం గెలవదు. నేను మీకు ముందుగానే చెబుతున్నాను. ఈసారి భారతదేశం గెలవదు’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు

వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారు..
మరోవైపు.. ఈ ఐఐటీ బాబా ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా.. పలువురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.  శుక్రవారం నోయిడాలోని ఓ టీవీ ఛానల్‌కు ఐఐటీ బాబా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు కాషాయ దుస్తులు వేసుకోని ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి వచ్చారు. వాళ్లు తనతో అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారని అభయ్‌ సింగ్‌ ఆరోపణలు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ముందు ఆందోళన చేశారు. చివరికి అధికారులు జోక్యం చేసుకొని ఆయన్ని అక్కడినుంచి పంపించారు. అయితే ఈ ఘటనకు ముందు ఐఐటీ బాబా ఛాన్‌ యాంకర్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read

Related posts