SGSTV NEWS
Andhra Pradesh

78 ఏళ్ల స్వాతంత్ర్యం లో మహిళలకుదక్కింది హత్యలు,  అత్యాచారాలేనా?…. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు

78 ఏళ్ల స్వాతంత్ర్యం లో మహిళలకుదక్కింది హత్యలు,  అత్యాచారాలేనా?…. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి.
        నిడదవోలు యార్న్ గూడెం రోడ్ పశువుల ఆసుపత్రి కూడలిలో ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో కలకత్తా డాక్టర్ నిర్భయ 2 కి నివాళి మరియు కఠినమైన చట్టాలు రూపొందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన.
         ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీర్రాజు మరియు పామర్తి సత్య నారాయణ లు మాట్లాడుతూ దేశంలో మహిళలు పై ప్రతి 2 గంటల కు ఒక మానభంగం జరుగుతోందనీ, కలకత్తా డాక్టర్ వంటి వారు బలవుతూనే వున్నారనీ, పాలకులు మాత్రం చోద్యం చూస్తున్నారన్నారు. మరోప్రక్క మోడి ప్రభుత్వం దేశం వెలిగిపోతోంది అనీ, అభివృద్ధి లో ప్రపంచం లో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న మోడి 3.ఓ పాలకులు అంతర్జాతీయ వేదికలపై మహిళలు, మైనారిటీలు, ఆదివాసీ ల రక్షణలో తాము సాధించిన ఈ ప్రగతి గురించి ఏం చెప్తారో దేశ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.
        ఇఫ్టూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్, కె.యన్.పి.స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడ్డం రవీంద్ర బాబు లు మాట్లాడుతూ నూతన చట్టాలు రూపొందించామని జబ్బలు జరుచుకొంటున్న యన్.డి.ఏ 3.ఓ ప్రభుత్వం నిర్భయ 2 లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ చట్టాలు రూపొందించారో సమాధానం చెప్పాలని, మరోప్రక్క ఒక మహిళ ముఖ్యమంత్రి గా వున్న రాష్ట్రంలో కీచక ప్రిన్సిపాల్ పై చర్యలు శూన్యమని, సదరు ప్రిన్సిపాల్ పై  గతంలోనే ఉమెన్ ట్రాఫికింగ్ , మెడికల్ మాఫియా, సెక్స్ రాకెట్ , మానవ మృగం, అవయవాల వ్యాపారం వంటి 28 అంశాలతో కూడిన ఫిర్యాదు వ్రాత పూర్వకంగా అందినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరించటమే కాక ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకున్నాక తన ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకొనేందుకు నిరసన ర్యాలీ లో పాల్గొని దొంగే దొంగ దొంగ అని అరిచినా చందంగా తన ప్రభుత్వాన్ని తానే ప్రశ్నించుకుంటూ తన గుప్పిట్లో పెట్టుకున్న అధికారాన్ని మాత్రం 13  రోజులైనా దోషులను పట్టుకోకుండా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారన్నారు. సుమోటోగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు ఐనా వాస్తవాల ఆధారంగా బాధిత డాక్టర్ నిర్భయ 2 కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
       పై కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు పిచ్చా సూర్య కిరణ్, మల్లిడి రామిరెడ్డి, కోనేటి మల్లేశ్, గాలి గని రాజు, వాసు, లంకాడ గణపతి, తూరుగోపు వెంకటేశు లు, నాగరాజు, మల్లిపూడి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share this