డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..సంగెం మండలం గవిచర్లకు చెందిన జింకల రాజు భార్య ప్రవళిక(25)కు ప్రెగ్నెంట్ అయినప్పటినుంచి క్యూర్ వెల్ ఆస్పత్రిలోనే చెకప్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రవళికకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు క్యూర్వెల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పాప పుట్టిందని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు
అక్కడ సోమవారం ప్రవళికకు డాక్టర్లు సర్జరీ చేసి డెలివరీ చేయగా పాప పుట్టిందని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లుగా కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రవళికకు తీవ్ర రక్తస్రావం అవుతుందని, బ్లైడ్ తీసుకురావాలంటూ ప్రవళిక భర్త రాజుకు చెప్పారు డాక్టర్లు. దీంతో వెంటనే రాజు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ లో నాలుగు యూనిట్ల ఏ పాజిటివ్ బ్లడ్ కొని తీసుకుని వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో ప్రవళిక హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందంటూ ప్రవళికను అంబులెన్స్ లో వరంగల్ లోని ఏకశిలా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి పై కేసు నమోదు
అక్కడికి వెళ్లి సీపీఆర్ చేస్తుండగా ప్రవళిక చనిపోయిందని డాక్టర్లు ఆమె కుటుంబసభ్యులకు వెల్లడించారు. అయితే ప్రవళిక మృతికి క్యూర్ వెల్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త రాజు మట్టవాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రవళిక మృతిపై ఎంక్వైరీ చేయించాలని వరంగల్ డీఎంహెచ్ ఓకు పోలీసులు లెటర్ రాశారు. విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని డీఎంహెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..