December 12, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: తలకు గాయమై ఆసుపత్రికి వస్తే .. మహిళ దుస్తులు విప్పి అసభ్యప్రవర్తన

నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

విశాఖపట్నం, పెద్దవాల్తేరు: నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు సూచిచండంతో .. అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్లింది.

ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జి ప్రకాశ్ .. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు ప్రకాశ్కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ మూడో పట్టణ సీఐ రమణయ్య ఆసుపత్రికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Also read

Related posts

Share via