November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

ప్రజల నీటి కష్టాలపై కొల్లు రవీంద్రను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పేర్ని నానికి లేదు….

*మచిలీపట్నం*
*31/03/2024*

*ప్రజల నీటి కష్టాలపై కొల్లు రవీంద్రను విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పేర్ని నానికి లేదు….*

*ప్రజల నీటి కష్టాలు తీర్చలేని పాలకులకు ఓటు అడిగే హక్కు ఉందా?*

*గ్రామాలలో ప్రజల దాహం కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి…. టిడిపి నాయకులు ప్రజల మంచినీటి కష్టాలపై మండిపడ్డారు…*

*మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, మాజీ జెడ్పిటిసి, లంకె నారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ, కాగిత వెంకటేశ్వరరావు, చిన్నాపురం సర్పంచ్, కాగిత గోపాలరావు, తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షుడు, కుంచె నాని, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇమ్మా బత్తుల దిలీప్ కుమార్, కే పి రామస్వామి, వనం సునీల్, గుమ్మడి ముఖర్జీ, కారం కి ఏడుకొండలు తదితరులు ఆదివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….*

మచిలీపట్నం నియోజకవర్గం లో త్రాగునీరు లేక గ్రామాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు అన్నారు.

గతంలో రోజు విడిచి రోజు నీరు అందించిన పాలకులు నేడు మూడు రోజులకు ఒకసారి త్రాగునీరు అందిస్తున్నారంటే నేటి వైసిపి పాలనలో మంచినీరు కూడా ప్రజలకు
అందించలేని దుస్థితిలో వైసీపీ పాలకులు ఉన్నారని మండిపడ్డాడు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఒక బిందె మంచినీరు ఇచ్చే పరిస్థితి లేదని, పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే నేడు ప్రజలకు ఈ పరిస్థితులు దాపురించాయి అన్నారు.

గతంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నీటి అవసరాలు తీర్చేలాగా మచిలీపట్నం నియోజకవర్గం లో చివరి ప్రాంతాలలో ఎనిమిది రిజర్వాయర్లు కట్టి, మంచినీటి పైపులైన్లు లీకేజీలు సరి చేయించి మండు వేసవిలో కూడా ప్రజలకు మంచినీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది, కొల్లు రవీంద్ర దే అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని అసమర్థత వల్ల ఈనాడు మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలకు మంచినీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు.

గతంలో కూడా వేసవిలో మంచినీటి ఇబ్బందులు వస్తే కృష్ణా నదిలో నుండి మోటార్లతో నీరు మచిలీపట్నంలోని
పంపుల చెరువు వరకు కాలువల ద్వారా తోడించి ప్రజల మంచినీటి కష్టాలు కొల్లు రవీంద్ర తీరిస్తే, పేర్ని నాని పాలనలో ప్రజలకు బిందెడు మంచినీరు కూడా ఇవ్వలేకపోవడం ప్రజలు గమనించాలి అన్నారు.

మచిలీపట్నం నియోజకవర్గం లోని ప్రజలు
ఆలోచన చేసి  కొల్లు రవీంద్ర పాలనలో ఏ విధంగా ఉంది, పేర్ని నాని కుటుంబ పాలనలో ఏ విధంగా ఉందో చిత్తశుద్ధితో ఆలోచించి వచ్చే ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసే కొల్లు రవీంద్రకు ఓటు వేసి గెలిపించి, మంచినీరు కూడా అందించలేని పేర్ని కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రతినిత్యం మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విమర్శించే నైతిక హక్కు పేర్ని నానికి లేదు అన్నారు.

Also read

Related posts

Share via