హైదరాబాద్ అత్తాపూర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మీరాలం ట్యాంక్ సమీపంలో ఏడేళ్ళ బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడి తలపై రాళ్ళతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారంతో అందుకున్న పోలీసులు బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ లో ఏడేళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు బాలుడిని తలపై రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని అత్తాపూర్ లోని మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని నెక్లెస్‌రోడ్డుకు చెందిన మహమ్మద్ రహీమ్‌గా గుర్తించారు. బాలుడు ఎవరు? ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అలాగే చుట్టుపక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
Also read
- Bengaluru Doctor Rapist: అనారోగ్యంతో వస్తే మహిళపై లైంగికదాడి – వీడియోలో రికార్డయిన బెంగళూరు డాక్టర్ నిర్వాకం
- వరకట్న వేధింపులు తాళలేక.. కుమారున్ని చంపి తల్లి ఆత్మహత్య
- సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో మొగల్తూరు సబ్ రిజిస్టర్
- వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామనకుంటున్నారా..? అయితే మీకే ఈ అలెర్ట్!
- నేటి జాతకములు.14 నవంబర్, 2025





