గచ్చిబౌలి వద్ద జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
హైదరాబాద్: గచ్చిబౌలి ఠాణా పరిధిలో అర్ధరాత్రి యువతిపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటోడ్రైవర్ ప్రవీణను లింగంపల్లి పరిధిలోని గోపీనగర్ అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, ఫోన్ నంబర్ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితుడి స్వగ్రామం నల్గొండ జిల్లా కేతిపల్లిగా గుర్తించారు.
చెన్నైకి చెందిన యువతి(32) గచ్చిబౌలిలోని నానక్రాంగూడలో నివాసం ఉంటున్నారు. ఆమె ఓ ప్రైవేటు సంస్థలో ఆర్కిటెక్ట్ పనిచేస్తున్నారు. ఇటీవల దసరా సెలవుల నేపథ్యంలో సొంతూరు వెళ్లిన యువతి సోమవారం అర్ధరాత్రి బస్సులో నగరానికి చేరుకున్నారు. నగర శివారు రామచంద్రాపురం దగ్గర రాత్రి 1.30 గంటలకు బస్సు దిగాక నానక్రాంగూడ వెళ్లేందుకు ఒక ఆటో ఎక్కారు. ఇంటికి వెళ్లేమార్గంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన రోడ్డులో ఉన్న మసీద్బండ కమాన్ వద్దకు రాగానే జనసంచారం లేకపోవడం చూసి డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపాడు.
యువతి ప్రశ్నించేలోపే వెనుక సీటులోకి వచ్చాడు. ఆమె నోరునొక్కి దాడి చేశాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించగా మరోసారి దాడి చేశాడు. దీంతో తలకు గాయమైంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దారిన వెళ్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ గమనించి ఆటో దగ్గరికి వచ్చారు. ఈలోపు అతను యువతిని కిందకు తోసేసి వెంటనే పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025