Hyderabad News: హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో విదేశీ యువతులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: హైదరాబాద్‌లోని (Hyderabad) గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టైంది. విదేశీ యువతులను ట్రాప్ చేసి వ్యభిచారం చేయిస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో పారిన్ అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా.. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ, హెచ్‌టీఎఫ్ అధికారులు దాడులు చేశారు. కెన్యా, బ్యాంకాక్, టాంజానియాకు చెందిన యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 9 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలోనే వ్యభిచారం గృహం నిర్వాహకులు పరారీ కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆన్ లైన్ ద్వారా ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..