మూసాపేట: ఆసుపత్రికి స్కూటీపై వెళుతున్న స్టాఫ్ నర్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన ప్రశాంతి (37) భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని రవి హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది.
శనివారం జగద్గిరిగుట్టలోని ఇంటి నుంచి ఆసుపత్రికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి వెళుతోంది. నెక్సాస్ షోరూమ్ వద్ద మలుపు వద్ద కూకట్పల్లి వైపు వేగంగా వెళుతున్న వెనుకనుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Also read
- గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్రీకరించిన పాట విడుదల…
- నేటి జాతకములు…17 అక్టోబర్, 2025
- Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
- HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య