SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: కలెక్టర్‌ను చంపేస్తామని మెయిల్.. మేడ్చల్‌లో హైఅలర్ట్!


హైదరాబాద్‌లో బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ పేల్చివేస్తామంటూ ఆగంతకుడు మెయిల్ పెట్టాడు. కలెక్టర్ గౌతం డీసీపీ పద్మజారెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు. మావోయిస్టు పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.

Hyderabad: తెలంగాణలో మరోసారి బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ పేల్చివేస్తామంటూ ఓ ఆగంతకుడు మెయిల్ పెట్టాడు. కలెక్టర్ గౌతం డీసీపీ పద్మజారెడ్డికి ఆదేశాలు ఇవ్వడంతో అప్రమత్తమయ్యారు. కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.


మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మెయిల్..

అయితే ఈ బాంబ్ బెదిరింపుల నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం అయ్యారు. అప్రమత్తమైన పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు అనే అంశంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మెయిల్ వచ్చిందని, చివరగా అందులో అల్లాహు అక్బర్ అనే నినాదం ఉందని తెలిపారు. ఇది ఎవరో కావాలని చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరిలో తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తామంటూ బెందిరింపులకు పాల్పడటం సంచలనంగా మారింది.  మూడు రోజులుగా ఫోన్ చేస్తూ సెక్రటేరియట్‌లో బాంబు పెట్టామని బెదిరిస్తున్న దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆగంతకుడి ఆచూకీ తెలుసుకున్నారు. అతడు ఫోన్ కాల్‌లో చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. సెక్రటేరియట్ ‌మొత్తం బాంబు స్వాడ్ వెతికినా బాంబు పేలుడు పదార్థాల ఆచూకీ లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read

Related posts