నాంపల్లి నియోజకవర్గం మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. దీంతో ఫోర్త్ ఫ్లోర్‌లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది
ఈ మధ్య కాలంలో లిఫ్ట్ కులిన ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు.. లిఫ్ట్ ఎక్కాలంటేనే భయ పడుతున్నారు. తాజా నాంపల్లి నియోజకవర్గంలో మరో ఘటన నగర వాసులను భయభ్రతులకు గురి చేస్తోంది. మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. దీంతో ఫోర్త్ ఫ్లోర్‌లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చోటి మసీద్ సమీపంలోని నాకో షమ్స్ అపార్ట్‌మెంట్ ఉంది. దానిలోని ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటున్న మక్సుద్ ఇంటికి ఆదివారం రాత్రి లంగర్‌హౌస్‌లో ఉండే బంధువు సయ్యద్ నసీరుద్దీన్, మైమూనా బేగం, సబీనా బేగం, ముగ్గురు పిల్లలు వచ్చారు. ఫోర్త్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్లిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందికి పడి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆగింది. లిఫ్ట్‌లో ఉన్న సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.
గాయపడిన క్షతగ్రతులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న.. ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ప్రమాదం జరిగిన పరిస్థితిని పరిశీలించారు. లిఫ్ట్ ప్రతిసారీ రిపేర్ అవుతోందని, గతంలో లిఫ్టు మధ్యలో ఇరుక్కుపోయిందని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. లిఫ్ట్ రిపేర్‌లో ఉన్న విషయం తెలియక నసీరుద్దీన్, కుటుంబ సభ్యులు ఎక్కారని, లిఫ్ట్ దగ్గర ఎలాంటి సూచిక బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. నాంపల్లి నియోజకవర్గంలో వరుసగా లిఫ్టు ప్రమాదాలు జరగటంతో కాలనీ వాసులు లిఫ్ట్ ఎక్కాలన్న భయ పడుతున్నారు.
Also Read
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
- ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్.. నాగలక్ష్మీ, సరళ ఎక్కడికి వెళ్లినట్లు..!
- సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం
- పూజ అయిపోయిన వెంటనే చేయకూడని 5 పనులు ఇవే..అలా చేస్తే దరిద్రం తప్పదు!