హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి
తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీ నగర్ ఎస్‌వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది.
బాలాపూర్‌లో 24 గ్రాముల హెరాయిన్, మీర్‌పేట్‌లో 1.5 కేజీల ఓపీఎం, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్స్, మొబైల్స్ సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025