జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలుడిపై 28ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉంటున్న 16ఏళ్ల బాలుడితో యువతి పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించి.. విషయం బయటకు చెప్పొందని బెదిరించిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలుడిపై 28ఏళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి పక్కనే ఉండే బాలుడిపై 28 ఏళ్ల యువతి కన్నేసింది. మాటిమాటికి ఇంటికి పిలిపించుకొని అసభ్యంగా పవర్తించేదని బాధిత మైనర్ బాలుడు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి పిలిచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిందని తెలిపాడు. అక్కడ జరిగిన విషయం బయటకు చెబితే.. రివర్స్‌లో అతడే రేప్ చేశాడని అందరికి చెబుతానని యువతి బాలుడికి వార్నింగ్ ఇచ్చిందట.
అలా ఉండాలని బెదిరించి మరీ..
దీంతో బాలుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయాడు. తాజాగా మరోసారి బాలుడిపై యువతి లైంగిక దాడి చేసింది. అలాగే అసభ్యకరమైన పనులు చేయాలని, ఆమెకు నచ్చినట్లు ఉండాలని బెదిరించడం ప్రారంభించింది. ఆ బాలుడు యువతి వేధింపులు తాళలేక విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా ఈ సంచలన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువతిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025