హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.
వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంకళ్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





