పుష్ప–2 సినిమా ప్రీమియర్ వల్ల అల్లు అర్జున్‌తో పాటూ సంధ్యా థియేటర్ కూడా చిక్కుల్లో పడింది. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న థియేటర్ యాజమాన్యానికి పోలీసులు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. థియేటర్ ఎందుకు మూసేయకూడదంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు
డిసెంబర్ 4న అన్ని థియేటర్లతో పాటూ హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో కూడా ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే దీనికి హీరో అల్లు అర్జున్‌తో పాటూ హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్‌లు కూడా వచ్చారు. అప్పటికే పుష్ప–2 సినిమా మీద, బన్నీ మీద విపరీతమైన బజ్ ఉంది. దీంతో అల్లు అర్జున్‌ను చూడ్డానికి ఫ్యాన్స్ విపరీతంగా వచ్చారు. దీంతో అతను వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ చనిపోగా…ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కారణంగా అల్లు అర్జున్ ఇప్పటికే అరెస్ట్ అయి ఒక రోజు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సంధ్యా థియేటర్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి పోలీసులు రెడీ అయ్యారని తెలుస్తోంది.
థియేటర్‌కు షోకాజ్ నోటీసులు..
సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఈ అంశం మీద సంధ్య థియేటర్ ఇంకా స్పందించలేదు. ఈ థియేటర్ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని పోలీసులు నోటీసులో అడిగినట్టు తెలుస్తోంది.
ఇక సంధ్యా 70MM థియేటర్ నిర్వహణలో లోపాలు చాలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సంధ్య 70MM ,సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రెండింటికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకవైపునే ఉంటాయి. రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు. దాంతో పాటూ థియేటర్‌లో మౌలిక సదుపాయాలు లేవు. వీటన్నిటితో పాటూ అల్లు అర్జున్ వస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంలో థియేటర్ నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు. ఇక అతను వచ్చినప్పుడు హీరో ప్రవైట్ సెక్యూరిటీని కూడా లోపలికి అనుమతించారు. టికెట్ కొన్నవాళ్లు మాత్రమే కాక అందరూ థియేటర్ లోపలికి వచ్చేశారు. ఈ విషయాన్ని థియేటర్ సిబ్బంది కంట్రోల్ చేయలేదు. అనధికారికంగా చాలా ఎక్కువ మంది లోపలికి వచ్చారు కాబట్టే తోపులాట జరిగింది.
Also Read
- Chain Snatching in Guntur: వీడియో ఇదిగో, తాడేపల్లిలో ఐదు నిమిషాల్లోనే రెండు చోట్ల చైన్ స్నాచింగ్స్,
- హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌కు మెసేజ్ పెట్టి యువతి ఆత్మహత్య
- Andhra Pradesh: మందేసి.. చిందేసి.. ఎమ్మెల్యే రచ్చ రచ్చ..!
- Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఏజెన్సీలో ఘోరం.. పసరు మందు వికటించి చిన్నారి మృతి..
- ఓరి వీడి యేషాలో.. హోంమంత్రి మనిషినని TTD సిబ్బందికే పంగనామాలు! స్కెచ్ మామూలుగా లేదుగా