HYDలోని నాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా ఐదుగురు దుండగులు ఆయన్ను వెంబడించి హతమార్చారు
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఘోరమైన హత్య జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక రౌడీషీటర్‌ను అతి కిరాతకంగా, అత్యంత క్రూరంగా కత్తులతో పొడిచి పొడిచి చంపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దారుణంగా పొడిచి పొడిచి
చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ ఒక రౌడీషీటర్. అతడు ఓ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు వచ్చాడు. అక్కడ తన కేసుకు సంబంధించి విచారణ అయింది. అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒకేసారి ఐదుగురు దుండగులు అతడిని వెంబడించారు
అలా వెంబడించి వెంబడించి చివరకు క్యాన్సర్ హాస్పిటల్ వద్ద మొదట బ్యాట్‌తో దాడి చేశారు. దీంతో అతడు కింద పడిపోగానే వరుసగా దుండగులంతా కలిసి కత్తులతో గొంతు కోసి.. ఆపై పొట్టలో పొడిచి చంపారు. అనంతరం రౌడీషీటర్ హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను ఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయారు.
దీంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని హత్య జరిగిన ప్లేస్‌ను పరిశీలించారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడనుంచి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే రౌడీషీటర్‌ను చంపడానికి గల కారణాలు ఏంటి..?, ఇది వరకు గొడవలు ఏమైనా ఉన్నాయా?, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది?.. అనే విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి
Also read
- Peacock feather: నెమలి ఈక ఇంట్లో ఉంటే.. ఈ దోషాలన్నింటికి శాశ్వత పరిష్కారం..మీ సంపద అమాంతం పెరుగుతుంది!
- OM Chanting: ఓం ఒక మంత్రం కాదు.. అనేక వ్యాధులకు దివ్య ఔషధం.. ఎలా ఎప్పుడు ఓంకారం జపించాలంటే..
- శివయ్య భక్తులు తప్పనిసరిగా చూడాలనుకునే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవే.. ప్రాముఖ్యత ఏమిటంటే
- నేటి జాతకములు…12 జూలై, 2025
- New Scam: అమాయక ప్రజలే వారి టార్గెట్.. ఖరీదైన, గిఫ్ట్‌లు, లాటరీ పేరుతో టోకరా.. ఆటో డ్రైవర్ నుంచి ఏకంగా.