హైదరాబాద్ నార్సింగ్ లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవీన్ చారి అనే యువ ఇంజనీర్ మరణించాడు. తొలిరోజు ఉద్యోగం చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్ నార్సింగ్ లో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవీన్ చారి అనే యువ ఇంజనీర్ మరణించాడు. తొలిరోజు ఉద్యోగం చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోకాపేట్ టీ గ్రీల్ వద్ద బైక్ వై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
ఎన్టీఆర్ జిల్లాలోనూ..
ఎన్టీఆర్ జిల్లాలోనూ రెండ్రోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన తిరునాళ్ల ఎగ్జిబిషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి వత్సవాయి మండలం కొత్త వేమవరంనకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గింజుపల్లి సాయికుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో సాయికుమార్ సోదరుడు గింజుపల్లి గోపిచంద్‌కు తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్, గోపిచంద్ మంగళవారం ఎగ్జిబిషన్‌కు వచ్చి జెయింట్ వీల్ ఎక్కారు. ఇంతలో వారిద్దరు కూర్చున్న బకెట్  ఊడి పడింది
ఈ ఘటనలో సాయికుమార్ పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై పడిపోయారు. దీంతో సాయికుమార్ తల రోడ్డుకు బలంగా తగలడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అతడి సోదరుడు గోపిచంద్ నేలపై పడటంతో కాలు, చేయి విరగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని వెంటనే అతడ్ని 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి తరలించి అక్కడి నుంచి విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. 
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





