జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిత్రీకరించాడు.
భూపాలపల్లి, : కట్టుకున్నవాడే కాలయముడు అయ్యాడు.. జీవితాంతం ప్రేమతో చూసుకోవాల్సిన భార్యను దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి హత్య చేశాడు.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని, ఓ గొర్రె పిల్లను సైతం చంపేసి.. ఆపై ఎవరో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చిత్రీకరించాడు. ఈ ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆకుదారివాడ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మల్హర్ మండలం అనుసాన్పల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ సుమత(30)ను 2016లో ఆకుదారివాడలో నివాసం ఉంటున్న ఇస్లావత్ హతిరాంనకు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నేళ్లు కాపురం సజావుగానే సాగింది. ఏడాదిన్నరగా భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. రెండుసార్లు గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. మంగళవారం ఉదయం హతీరాం పనికి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలను పాఠశాలకు పంపించి.. సుమత ఇంటి సమీపంలో సింగరేణి ఓసీ-2 గని సమీపంలో ఖాళీగా ఉన్న పాత ఇళ్ల ప్రాంతంలో గొర్రె పిల్లను మేత కోసం తీసుకెళ్లింది.. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హతీరాం ఇంటికి రాగా, తాళం వేసి ఉండటంతో ఓసీ-2 సమీపంలోని పాత ఇళ్ల వద్దకు వెళ్లి చూశాడు. అక్కడే ఇద్దరు కాసేపు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఆమెను చున్నీతో ఉరేసి చంపాడు. ఒంటిపైనున్న బంగారు గొలుసులు తీసుకున్నాడు. అక్కడే ఉన్న గొర్రె పిల్లను సైతం చంపేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాలుడు ఉన్నారు. మృతురాలి తండ్రి గుగులోతు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు.
Also read :అప్పు ఎగ్గొట్టేందుకు హైడ్రామా.. అసలుగుట్టు రట్టు చేసిన పోలీసులు..
అప్పు ఎగ్గొట్టేందుకు హైడ్రామా.. అసలుగుట్టు రట్టు చేసిన పోలీసులు..
Tirumala: వామ్మో.. తిరుమలలో 8 అడుగుల జెర్రిపోతు.. ఈయన చూడండి ఏం చేశాడో..