SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: ఏపీలో దారుణం.. భార్యను నరికి.. గొంతు కోసుకున్న భర్త!


ఏలూరు జిల్లా ఎస్‌ఆర్‌పి అగ్రహారంలో దారుణం జరిగింది. కుటుంబ ఆస్తుల విషయంలో కట్టా జయలక్ష్మి (47)ను ఆమె భర్త పెద్దిరాజు కత్తితో నరికి చంపి.. తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AP Crime: ఏలూరు(Eluru) జిల్లాలోని కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పి అగ్రహారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆస్తుల విషయంలో తలెత్తిన వాదనలు చివరికి హత్యకు దారి తీసింది. స్థానికంగా నివసిస్తున్న కట్టా జయలక్ష్మి (47)ను ఆమె భర్త పెద్దిరాజు కత్తితో నరికి చంపాడు. ఈ ఘోరమైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన తర్వాత పెద్దిరాజు తాను కూడా చాకుతో తన గొంతు కోసుకొని.. అనంతరం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని  పోలీసులు వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

భార్యను హత్యచేసిన భర్త..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వివరాల ప్రకారం.. జయలక్ష్మి–పెద్దిరాజు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడికి ఇప్పటికే వివాహమై.. వేరుగా జీవిస్తున్నాడు. కుటుంబానికి చెందిన నాలుగు సెంట్ల స్థలాన్ని అతడికి ఇచ్చి ఇల్లు కట్టించాలన్న ఆలోచనతో జయలక్ష్మి నిలబడింది. అయితే తన పెద్ద కుమారుడికి ఆస్తి ఇవ్వడం ఇష్టం లేకపోయిన పెద్దిరాజు భార్యతో తరచూ గొడవపడేవాడు. భార్య తన పెద్ద కుమారుడికి మద్దతు ఇవ్వడాన్ని అతడు అసహ్యించుకున్నట్లు సమాచారం.

ఈ విభేదాలు రోజురోజుకు ముదిరిపోయి చివరకు ప్రాణహానికే దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి నిద్రిస్తున్న సమయంలో జయలక్ష్మిని పెద్దిరాజు కత్తితో దారుణంగా నరికి చంపాడు. తర్వాత తనను తాను చాకుతో గాయపరిచి పురుగుల మందు తాగేడాడు. ఉదయం ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై తీవ్రంగా గాయపడిన పెద్దిరాజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసును మరింత లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this