డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు నేటి సమాజం డబ్బు చుట్టే తిరుగుతుంది. డబ్బు కోసం సొంతవాళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు.. దాడులకు పాల్పపడుతున్నారు.
డబ్బు కోసం ఈ మధ్య ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. ఆస్తుల కోసం సొంతవారిని సైతం హత్య చేయడానికి వెనుకాడటం లేదు. సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోతుంది. లగ్జరీ జీవితాలు గడిపేందుకు ఎన్ని దుర్మార్గాలకైనా తెగబడుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భర్త, కన్నతల్లిగా చూసుకుంటన్న అత్తను ఇన్సురెన్స్ డబ్బు కోసం ఓ కోడలు దారుణానికి తెగబడిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.
ఒకప్పుడు అత్తింట్లో అడుగు పెట్టిన కోడలు అత్తమామలు, భర్త చెప్పే మాటలు వింటూ భయభక్తులతో ఉండేవారు. భర్త, అత్త ఏది చెబితే ఆ పని చేసేవారు. కోడళ్లపై అత్తల పెత్తనం ఓ రేంజ్ లో కొనసాగించేవారు. అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనే సామెత గురించి తెలిసిందే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అనిగి మనిగి ఉండే కాలం పోయిందని అంటున్నారు కోడళ్ళు. ఇటీవల కోడళ్ల చేతిలో హింసలకు గురైన అత్తలకు సంబంధించిన వార్తలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఓ కోడలు చేసిన దారుణం సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
బేగం బజార్ లో భర్త, అత్తపై భార్య, ఆమె బంధువులు చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్తను చంపితే ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయని కోడలు కన్నీంగ్ ప్లాన్ వేసింది. ఇందుకోసం కొంతమంది దుండగులతో ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా దాడి చేయించింది. చుట్టుపక్కల వాళ్లు ఆపే ప్రయత్నం చేయగా దుండగులు కత్తులతో బెదిరించారు. ఈ దాడి ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025