SGSTV NEWS online
Andhra PradeshCrime

Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళను భర్త, అత్తమామలు, ఆడపడుచు దారుణంగా హింసించి చంపేశారు.

నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళను భర్త, అత్తమామలు, ఆడపడుచు దారుణంగా హింసించి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. కట్నం కోసం మహిళను భర్త హరికృష్ణ, అత్తమామలు నాగోరు, నర్సమ్మ, ఆడపడుచు నాగలక్ష్మి గత కొంతకాలంగా వేధిస్తున్నారు. పలుమార్లు ఆమెపై దాడి చేశారు. బాధితురాలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని వారిని హెచ్చరించింది. ఇలా చెప్పడంతో తాజాగా ఆమెపై మరోసారి దాడికి పాల్పడ్డారు. ఫిర్యాదు చేస్తుందని భయపడి రంగునీళ్లు తాగించి ఊపిరాడకుండా చేశారు. అనంతరం వివస్త్రను చేసి దారుణంగా కొట్టి హతమార్చారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Also read

Related posts