భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం పెళ్లైన వాసు భార్యను డెలివరీకి పంపి ప్రియురాలితో ఏకంగా కాపురం పెట్టాడు.
Husband’s affair : భార్య ఉండగానే ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య ఆమె బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వాసుకు రెండున్నరేళ్ల క్రితం పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం పళ్లకొండకు చెందిన నవ్యశ్రీతో వివాహమైంది. వాసు సత్తెనపల్లిలో ప్లాస్టిక్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటాడు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చి సత్తెనపల్లిలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య నెలతప్పడంతో పుట్టింటికి పంపించాడు. అప్పటినుంచి సత్తెనపల్లిలో ఒంటరిగా ఉంటున్నాడు.
కాగా వ్యాపార నిమిత్తం తరచూ హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో బంధువుల అమ్మాయి గాయత్రితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భార్య డెలివరీ అయి ఇంటికొచ్చిన తర్వాత కూడా కొంతకాలం మాత్రమే ఉంచుకొని ఏదో ఒక కారణం చెప్పి ఆమెను తిరిగి పుట్టింటికి పంపాడు. అయితే తరుచుగా భార్య వస్తానని చెప్తున్న నేను ఊర్లోలేను, అందుబాటులో లేను అంటూ ఏడాది కాలంగా దాటవేస్తు వస్తున్నాడు. అందులో భాగంగా గాయత్రిని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి సత్తెనపల్లి లో కాపురం పెట్టాడు.ఈ విషయం భార్యకు తెలియకుండా ఉండడం కోసం సత్తెనపల్లిలో మూడు ఇళ్లు మారాడు.
అయితే ఈ విషయంలో భార్య నవ్యశ్రీ బంధువులకు అనుమానం రావడంతో వాసుమీదా నిఘా పెట్టారు. ఈక్రమంలో సత్తెనపల్లి బోయకాలనీలో వాసు గాయత్రితో ఉంటున్న విషయం తెలుసుకొని బంధువులతో కలసి వచ్చి వారిని రెడ్ హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. భార్య రాకను గమనించిన భర్త వాసు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తతోపాటు ప్రియురాలికి భార్య, బంధువులు దేహశుద్ది చేశారు. ఇద్దరిని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయత్రి తన తల్లిదండ్రులకు చెప్పకుండా వాసుతో వెళ్లిపోయింది. ఈ విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ హైదరాబాద్‌లో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం కొసమెరుపు.
Also read
- ఏంటీ సుధా ఇలా తయారయ్యాడు..! సరిపోదా శనివారం సినిమాను నిజం చేశాడుగా.. ఆ ఒక్కరోజు..
- రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..
- Palnadu : మరో మహిళతో భర్త ఎఫైర్…రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
- హిందూ సంపద అష్టాదశ పురాణాలు- పేర్లు స్మరిస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయ్!
- నేటి జాతకములు 5 ఫిబ్రవరి, 2025