SGSTV NEWS
SpiritualVastu Tips

Vastu Tips: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా..? అశుభానికి శ్రీకారం అక్కడి నుంచే..!



హిందూ మతంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యనిస్తారు. ఇల్లు ఏ దిక్కున నిర్మించుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇంటి ప్రవేశ ద్వారాం, గేట్ ఎలా ఉండాలి..? ఇంటి ముందు ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి.. ఎలాంటి చెట్లు నాటుకోవాలి.? వంటి అనేక అంశాలు వాస్తులో ప్రస్తావించారు. అయితే, ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు పెడితే ఏమౌతుందో తెలుసా…? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే..


ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్న స్థలంలోనే ఏదో ఒక పూలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. ఇది మంచి అలవాటు. కానీ, మీరు మీ ఇంటి ఆవరణలో పెంచే చెట్లు, మొక్కలు మీ ఇంటి వాస్తును ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచటం వల్ల ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటిదే బొప్పాయి కూడా ఒకటి.. వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పొరపాటున పెరిగినా కూడా దాన్ని వెంటనే పీకి మరో చోట నాటాలని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదని చెబుతుంటారు. వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు.

అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు. ఇంటి ముందు, ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు, కష్టాలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని చెబుతున్నారు.

Also read

Related posts