అడ్డాల నాడు బిడ్డలు.. కానీ గడ్డాల నాడు కాదు అనే నానుడి మరోసారి నిజమైంది. నవ మాసాలు మోసి కనిపించిన కన్న తల్లిపై కనికరం చూపలేదు ఆ బిడ్డలు. వృద్ధాప్యంలో తల్లిని కంటికి రెప్పలా చూడాల్సిన కన్న కొడుకులకు ఆమె భారమైంది. మృత్యువుతో పోరాడి చివరికి అనాథలా తనువు చాలించింది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. అనుబంధాలను సమాధి చేసే అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన మన్నూరి రామస్వామి, సైదమ్మ(80) దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీనాలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రామస్వామి 30 ఏళ్ల క్రితం మృతి చెందాడు. కుమారులు.. సైదమ్మను పట్టించుకోకవడంతో విద్యానగర్ రామాలయం వద్ద చెట్టు కింద ఒంటరిగా ఉంటుంది. ప్రభుత్వ అందించే వృద్ధాప్య పెన్షన్‌తో కాలం వెళ్లదీస్తోంది. పెళ్లిలైన మనవళ్లు, మనవరాళ్ళు వచ్చినా చేరదీయకపోవడంతో నాలుగు నెలల క్రితం నేరేడుచర్లలోని వృద్ధాశ్రమంలో చేరింది. నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల క్షీణిస్తున్న సైదమ్మ ఆరోగ్యం సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు ఇచ్చారు.
అయితే అంతిమ సంస్కారాలకు మేము రాము తీసుకువెళ్లిన చోటే వదిలేయండి అంటూ సైదమ్మ కుటుంబ సభ్యులు ఆశ్రమ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. దీంతో గత్యంతరం లేక ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది సైదమ్మను పట్టణం చౌరస్తాలో వదిలేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సైదమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఎండ తీవ్రతకు తట్టుకోలేని స్థితిలో ఉండడంతో స్థానికులు108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది సైదమ్మను హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న సైదమ్మ చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచింది.
సైదమ్మ చనిపోయిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే తమ వద్ద డబ్బులు లేవని మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు నిరాకరించారు. అంత్యక్రియల కోసం హుజూర్ నగర్ మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో సైదమ్మ కుటుంబ సభ్యులను స్థానికులు మందలించి అంత్యక్రియలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు అంగీకరించారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!