నెమలి ఈక కు ప్రతిరోజు సాంబ్రాణి పొగతో ధూపం వేయాలని చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లోకి అపారమైన సంపద వచ్చి చేరుతుంది. నెమలి ఈకలు అనేవి ఇంట్లో దంపతుల మద్య అన్యోన్యతకు కూడా కారణమవుతాయని అంటున్నారు. ఇంట్లో డబ్బు దాచుకునే చోట నెమలి ఈకలను దాచుకోవటం వల్ల ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది.
నెమలి ఈకలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. అందుకే.. చాలా మంది తమ ఇళ్లలో నెమలి ఈకల్ని అలంకరణ కోసం పెట్టుకుంటూ ఉంటారు. నెమలిని ఏకంగా శ్రీ కృష్ణుడు తన తలకొప్పులో ధరించాడు. నెమలి ఇంట్లో ఉంటే ఆ చిన్ని కృష్ణుడు మన ఇంట్లో నివాసం చేస్తున్నట్లుగా భావిస్తారు. అయితే, నెమలి ఈకలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇంటికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఇంట్లో లేదా ఆఫీస్లో పెట్టుకోవడం వల్ల వాస్తుపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నెమలి ఈకలు ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. నెమలి ఈకలు చెడు ప్రభావాల్ని దూరం చేస్తాయి. గ్రహాదోషాలు, ఇంట్లో అశాంతిని తొలగిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే, కాలసర్పదోషాలు పీడిస్తే నెమలి ఈకలు సమస్యల్ని పొగొడుతాయని జ్యోతిష్యా వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. నెమలి ఈకల్లో ధనాన్ని ఆకర్శించే స్వభావం ఉంటుందని చెబుతున్నారు.
నెమలి ఈక కు ప్రతిరోజు సాంబ్రాణి పొగతో ధూపం వేయాలని చెబుతున్నారు. దీని వల్ల ఇంట్లోకి అపారమైన సంపద వచ్చి చేరుతుంది. నెమలి ఈకలు అనేవి ఇంట్లో దంపతుల మద్య అన్యోన్యతకు కూడా కారణమవుతాయని అంటున్నారు. ఇంట్లో డబ్బు దాచుకునే చోట నెమలి ఈకలను దాచుకోవటం వల్ల ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది
