మానవత్వం మంట కలిసింది. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవలసిన కుటుంబ సభ్యులు రోడ్డుపై వదిలేశారు. ఏకంగా ఆమెకు వస్తున్న పెన్షన్ మాత్రం తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఆమె బాగోగులు పట్టించుకోకుండా ఆమె పెన్షన్ డబ్బులకు వచ్చి డబ్బులు పట్టుకుపోతున్న కుటుంబ సభ్యులను బస్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్లు, పళ్ళ వ్యాపారులు అడ్డుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం వెలుగు చూసింది. మతిస్థిమితం లేని మహిళను మానవత్వం లేకుండా రోడ్డు మీదే వదిలేశారు కుటుంబ సభ్యులు. అయితే నెల నెలా వచ్చే పెన్షన్ డబ్బులు మాత్రం తీసుకుని వెళ్ళిపోతున్నారు. కొత్తపేట మండలం మందపల్లికి చెందిన మద్ధింశెట్టి బంగారమ్మను మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబసభ్యులు వదిలించుకోవలనుకున్నారు. దీంతో అమలాపురం బస్ స్టాండ్ వద్ద కొన్ని ఏళ్ళ క్రితం వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.
అయితే ఆమెకు నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులను వదలడంలేదు.ప్రతి నెల ఆమెకు వచ్చే పెన్షన్ ను సచివాలయం ఉద్యోగిని తీసుకువచ్చి వేలిముద్ర వేయించి డబ్బులు తీసుకెళ్లి పోతున్నారు కుటుంబ సభ్యులు. ఆమె బాగోగులు పట్టించుకోకుండా ఆమె పెన్షన్ డబ్బులకు వచ్చి డబ్బులు పట్టుకుపోతున్న కుటుంబ సభ్యులను బస్టాండ్ వద్ద ఉన్న ఆటో డ్రైవర్లు, పళ్ళ వ్యాపారులు అడ్డుకున్నారు. వృద్ధురాలి మంచిచెడ్డని కుటుంబసభ్యులకు పెన్షన్ డబ్బులు తీసుకెళ్లడం ఏంటని నిలదీశారు. కొన్నాళ్ళుగా ఆమెకు భోజనం పెడుతూ, అన్ని మంచిచెడ్డలు మేము చూస్తున్నామని, ఆమె ఆలనా పాలనా చూడకుండా ఆమె డబ్బులకు వస్తారా అంటూ మండిపడ్డారు. పెన్షన్ ఇస్తున్న సచివాలయ ఉద్యోగపైన చర్యలు తీసుకోవాలంటే ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు
Also read
- ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం.. వీరికి ఆర్థిక లాభాలు, ఊహించని ప్రయోజనాలు
- శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన ఇసుక శివలింగం.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎక్కడో కాదు హైదరాబాద్కు దగ్గర్లోనే
- శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ల కూడదా? ఎందుకో తెలుసా?
- Andhra News: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. చేజింగ్ చేసి తనిఖీ చేయగా..
- Andhra Pradesh: కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న ఓ తండ్రి.. ఏం చేశాడో తెలుసా..?