June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

అధిక లాభాలు ఆశ .. గోల్డ్ ట్రేడింగ్లో మోసపోయిన 500మంది బాధితులు

హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సుమారు 500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. హబ్సిగూడా కేంద్రంగా నిందితుడు రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యకాలాపాల్ని ప్రారంభించాడు. ఈ కార్యాలయంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఐదు నెలల్లో రెట్టింపు చేస్తానంటూ ప్రచారం చేశాడు.

Also read :పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు

ఆ ప్రచారాన్ని నమ్మిన సుమారు 500 మంది నుంచి ఒక్కొక్కరు రూ.5 లక్షల నుంచి రూ. కోటిరూపాయల వరకు వసూలు చేశాడు. ఆపై వారిని నమ్మించేందుకు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లో 2 శాతం లాభాల్ని వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా రెండు నెలల పాటు వారం వారం కొంత మొత్తంలో చెల్లించాడు.

దీంతో ప్రహణేశ్వరి ట్రేడర్ పేరు మారుమ్రోగింది. హబ్బిగూడ పరిసర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వందల కోట్లు వచ్చిపడ్డాయి. అదును చూసిన రాజేష్ బిచానా ఎత్తేశాడు. రాజేష్ తీరుపై అనుమానం రావడంతో పెట్టుబడి దారులు తాము మోసపోయామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read +లగ్జరీ లైఫ్ గడిపిన పవిత్ర గౌడ్.. ఇప్పుడు జైల్లో నిద్ర పట్టక!

Related posts

Share via