ఒంగోలు::
సెలవు రోజు ఉల్లాసంగా సంబరాలు చేసుకున్న స్థానిక రామ్ నగర్ లోని ఎనిమిదవ లైన్ లో గల బిఆర్ ఒలంపియాడ్ హై స్కూల్ విద్యార్థులు. శుక్రవారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా “ఫీస్టా ఎలేషన్” పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు పాటలకు నృత్యాలు చేశారు. ఉల్లాసంగా సందడి చేశారు. మరికొందరు తమ విద్యకు సంబంధించిన సైన్స్, మ్యాథ్స్, రసాయన శాస్త్రంలోని పలు అంశాల పై ప్రసంగించి తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ కే దిలీప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిలీప్ కుమార్ రెడ్డి విద్యార్థులలో నిద్రాణమై ఉన్న శక్తిని ఉద్దీపన చేసే విధంగా ప్రేరణాత్మక ప్రసంగం చేశారు చిన్న చిన్న ఉదాహరణలు తెలుపుతూ ప్రకృతి నుంచి మనం ఏమి నేర్చుకోవాలనే విధానాన్ని సోదాహరణలతో వివరించారు. లక్ష్యసాధనకు చేతనాత్మకమైన అభివృద్ధికి తీసుకోవలసిన విషయాలను విపులీకరించారు.
సెలవు రోజు కావడంతో రంగురంగుల సీతాకోకచిలుకలల్లే విద్యార్థులు రంగురంగుల వస్త్రాలను ధరించి ఉత్సాహంగా ఆడి పాడారు. స్కూల్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కార్యక్రమ నిర్వహణ చేశారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే