March 11, 2025
SGSTV NEWS
CrimeNational

లాడ్జీలో హైటెక్ వ్యభిచారం.. 12 మంది మహిళల అరెస్టు

• 12 మంది మహిళల రక్షింపు

• ఇద్దరు అరెస్ట్

కొరుక్కుపేట: మంబాయి తరహాలో తిరుపూర్లో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. దీంతో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ప్రక్కా ప్రణాళికతో లాడ్జీలల్లో ఉన్న 12 మందిమహిళలను రక్షించి, ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘనట తిరుపూర్లో కలకలం రేపింది. వివరాలు..

తమిళనాడులోని తిరుపూర్ సెంట్రల్ బస్ స్టేషన్ వెనుక ఉన్న లాడ్జీలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మహిళలను వేధింపులకు గురిచేస్తున్నట్లు సౌత్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంబంధిత లాడ్జిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో లాడ్జీల్లోని గదుల్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను చూసి పోలీసులు అవాక్కయ్యారు ఇందులో 12 మంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.

ఆ తర్వాత పోలీసులు మొత్తం 12 మందిని రక్షించి షెల్టర్కు అప్పగించారు. ఇక లాడ్జీ యజమాని సంపత్ కుమార్ వ్యభిచారానికి అనుమతి ఇచ్చినట్లు తేలడంతో అతడితో పాటు మేనేజర్ నీలా కందన్ (44)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా వ్యభిచారం నిర్వహిస్తున్న 12 మంది మహిళలు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.

Also read

Related posts

Share via