ప్రభుత్వాలు మాత్రమే మారతాయి మిగిలింది అంతా ఒక్కటే
అక్రమ రేషన్ రవాణాకు అడ్డగా గన్నవరం సూరంపల్లి ప్రాంతం
సుమారు 500 బస్తాల బియ్యం నిల్వ చేసిన అక్రమ రేషన్ దొంగలు
నెలలో ఒకటవ తారీకు లోనే సుమారు 500 బస్తాలు నిల్వ చేయగలిగితే.. అసలు ఈ దందా ఏ విధంగా జరుగుతుంది అనేది అర్ధం అవుతుంది.
ప్రభుత్వ పథకాలకు గండి కొడుతున్న రేషన్ దొంగలు..
ప్రశ్నిస్తే విలేఖరులపై తప్పుడు కేసులు నమోదు..
అడ్డొస్తే అధికారులకు సైతం వార్నింగులు..
అవినీతి అధికారులకు.. నోట్ల తో.. సమాధానం.
ప్రభుత్వ బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్న పెద్ద మనిషి ముసుగులో తిరుగుతున్న కేటుగాళ్లు..
అధికారం ఏ పార్టీది అయినా… వ్యాపారం మాత్రం మాదే అంటున్న రేషన్ దొంగలు
పార్టీలకు అతీతంగా పాతికేళ్ళుగా పాతుకు పోయిన రేషన్ మాఫియా డాన్ అక్రమ రేషన్ రవాణా వ్యాపార సామ్రాజ్యం.
గత నెలలో అదే గోదాములో ఇద్దరు యూట్యూబ్ గొట్టం ఛానెల్ వారు వెళ్ళి ఇదేమని ప్రశ్నించగా.. వారి పై దాడికి చేసి బలవంతపు వీడియోలు తీసి.. తాను రేషన్ వ్యాపారం గతంలో చేసే వాడిని ఇప్పుడు *సుద్దపూస* ని అని ప్రచారం చేసిన రేషన్ డాన్.
వారితో పాటు వేరే ఇద్దరు విలేఖరుల పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేయించిన రేషన్ డాన్… ఇప్పుడు అదే గోదాములో 23టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేయడంతో విస్తు పోతున్న స్థానికులు…
సంబంధిత అధికారులకు అందిన సమాచారం మేరకు గోడౌన్ పై దాడులు నిర్వహించి నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఏం. ఎల్. ఎస్ పాయింట్ కు తరలించిన అధికారులు.. అక్రమ రేషన్ వ్యాపారి పామర్రు రమేష్ అలియాస్ గొట్టపు రమేష్ పై 6A కేసు నమోదు..?
గతంలో అదే గన్నవరంలో అతనిపై అక్రమ రేషన్ వ్యాపారం చేస్తున్నట్లు గా కేసు నమోదు అయినప్పటికీ.. క్లీన్ చిట్ ఇచ్చి అతనిపై కేసు పెట్టిన విలేఖరుల పై FIR నమోదు కావడం.. పోలీసులను అతను ఎంత తప్పు ద్రోవ పట్టించగలడు అనేది అర్ధం అవుతుంది. ఇప్పటికైనా ఈ రేషన్ దొంగలపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





