అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు
671 మార్కులతో పాసయ్యాడు
మృత్యువుతో పోరాడి అలసిపోయాడు
హైదరాబాద్: అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు.. భవిష్యత్తు బాగుండాలని అందరిలానే కలలు కన్నాడు.. బుధవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో పస్ట్‌క్లాస్ మార్కులతో పాసయ్యాడు.. కానీ తన రిజల్ట్స్ చూసుకోకుండానే విధి వక్రీకరించడంతో సదరు బాలుడు మృతిచెందాడు.. వివరాల్లోకెళితే గాజులరామారం డివిజన్ రోడామేస్త్రీనగర్‌కు చెందిన మీర్జా నయీమ్‌బేగ్, అస్రాబేగంలకు కుమారుడు మీర్జా హంజాబేగ్(17) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అయినా పట్టుదలతో చదివి 10వ తరగతి పరీక్షల్లో పస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమ్మని తల్లిదండ్రులు కోరినా చదవాలనే కోరికతో ఐడీపీఎల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. మార్చి 2024లో అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్ పరీక్షలు రాశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అస్పత్రిలో చేరిన హంజాబేగ్ చికిత్స పొందుతూ మార్చి 27న మృతి చెందాడు. బుధ వారం ఇంటర్ ఫలితాలు చూసిన తల్లిదండ్రు లు తమ కుమారుడు 671మార్కులతో పాసయ్యాడని తెలుసుకుని బోరున విలపించారు.
Also read
- టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!





