రిజిస్ట్రార్ ఫిర్యాదుతో కేసు నమోదు
గచ్చిబౌలి (హైదరాబాద్): తమ గదిలోని రెండు ల్యాప్టాప్లు
దొంగిలించాడని హెచ్సీయూ ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థిపై సహ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. పశ్చిమ బెంగాల్కు చెందిన మయాంక్ కుందు (23) సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎఫ్ హాస్టల్లోని రూమ్ నంబర్ 242లో సెకండ్ ఇయర్ విద్యార్థి సుప్రతి లోహతో కలిసి ఉంటున్నాడు.
రీడింగ్ రూమ్ లో రెండు ల్యాప్టాప్లు మయాంక్ చోరీ చేశాడని ఇద్దరు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఈ నెల 17న వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ల్యాప్టాప్లు తీసి ఉంటే తిరిగివ్వాలని విద్యార్థులు కోరారు. ఆ ల్యాప్టాప్ల విషయం తనకు తెలియదని మయాంక్ చెప్పాడు. ల్యాప్టాప్ ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. దీంతో రూమ్మేట్ కు చెప్పకుండా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ తిరిగి రాలేదు. ల్యాప్టాప్ లు పోయాయని లైఫ్ సైన్స్ విద్యార్థులు సోమవారం ఉదయం గచ్చి బౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
అయితే హాస్టల్ నుంచి వెళ్లిన మయాంక్ వర్సిటీ క్యాంపస్లోని బఫెల్లో లేక్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చెరువులో మయాంక్ మృతదేహాన్ని గుర్తించారు. హెచ్సీయూ రిజ్స్టార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా రు. కాగా, డ్రగ్సు బానిస కావడంతోనే కొన్నిసార్లు ల్యాప్టాప్లు తస్కరించానని, తాజా ల్యాప్టాప్ విషయం మాత్రం తనకు తెలియదని మయాంక్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Garuda Purana: గరుడ పురాణం హెచ్చరిక.. ఈ 5 రకాల వ్యక్తులతో ఉంటే కష్టాలు, అపజయాలు తప్పవట!
- Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశులకు వారఫలాలు
- అవినీతి,అక్రమాల మయంగా మారిన “Ap.బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ”…
- హైదరాబాద్లో తీవ్ర విషాదం.. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
- రాత్రి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన భార్య.. తెల్లారే సరికి కనిపించని భర్త.. అసలు ట్విస్ట్ తెలిస్తే..





