చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై అంజయ్య కథనం ప్రకారం..
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసు రాజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి దేవయ్య, దండుగుల నరేశ్ వద్ద ఏడేళ్ల క్రితం రెండు తులాల బంగారాన్ని అప్పుగా తెచ్చుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. కొన్నాళ్లకు రెండు తులాల బంగారం తిరిగిచ్చాడు. ఒప్పందం ప్రకారం మరో తులం బంగారం బాకీ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రాజు గల్ఫ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అప్పటినుంచి దేవయ్య, నరేశ్ బంగారం కోసం రాజును వేధిస్తున్నారు. మంగళవారం కూడా వచ్చి తులం బంగారం అడిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ‘నీ భార్యను తీసుకెళ్తేనే బంగారం ఇస్తావు..’ అంటూ దేవయ్య, నరేశ్.. రాజు భార్య చేయి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన అతడు అక్కడే ఉన్న పురుగుల మందు తాగాడు. రాజు భార్య ఫిర్యా దు మేరకు దేవయ్య, నరేశ్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య వివరించారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..