బంధుత్వం లేకపోయినా.. ఆ దంపతులను అక్కా, బావ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. చివరికి ఆ మృగాడే వారి మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, హతమార్చి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.

పుత్తూరు, : బంధుత్వం లేకపోయినా.. ఆ దంపతులను అక్కా, బావ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. చివరికి ఆ మృగాడే వారి మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, హతమార్చి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. వడమాలపేట మండలానికి చెందిన మహిళను కేవీబీపురం మండలంలోని ఓ వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి మూడున్నరేళ్ల కుమార్తె, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. స్వగ్రామంలో పనుల్లేక ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు అత్తగారింటికి వచ్చారు. కొన్నాళ్లుగా ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరి ఇంటికి సమీపంలోనే ఉంటున్న సుశాంత్ అలియాస్ నాగరాజు(23)కు తల్లిదండ్రులు లేరు. పెద్దనాన్న చెంచయ్య వద్ద పెరిగాడు.
వ్యసనాలకు బానిసగా మారడంతో అతడిని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో చెంచయ్య కుమారుడు వెంకటేష్ వద్ద ఉంటున్నాడు. చిన్నారి తల్లిదండ్రులను అక్కా బావ అంటూ వరసలు కలిపి పిలిచేవాడు. శుక్రవారం మధ్యాహ్నం సుశాంత్ మద్యం తాగాడు. చిన్నారి తండ్రి తన బావమరిదికి కాలు విరగడంతో కట్టు కట్టించేందుకు తీసుకెళ్లాడు. సాయంత్రం సుశాంత్ వచ్చి పాపకు చాక్లెట్లు కొనిస్తానని తల్లికి చెప్పి తీసుకెళ్లాడు. పాప ఎంత సేపైనా కనిపించకపోవడంతో అతడిని నిలదీసింది. తనకు తెలియదని బుకాయించాడు. ఊరంతా వెతికినా.. ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో విచారించడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. పాఠశాల ఆటస్థలం పక్కనే ఉన్న వంకలో చిన్నారి శవాన్ని పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీ రవికుమార్ లు గ్రామానికి వెళ్లి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ వారికి తెలిపారు.

బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం
తిరుపతి(కలెక్టరేట్), : తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. హోం మంత్రి అనిత ఆదివారం చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి సాయాన్ని అందించనున్నారు.
Also read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి