భార్య ఎంతో అందంగా ఉండటం, గ్రామంలో బాగా తయారై బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు.
రామనగర, : భార్య ఎంతో అందంగా ఉండటం, గ్రామంలో బాగా తయారై బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు. ఇదే విషయమై అనేకసార్లు గొడవ పడేవాడు. ఆఖరికి నమ్మించి బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. కర్ణాటకలో రామనగర జిల్లా మాగడికి చెందిన దివ్య (32), ఉమేశ్ భార్యా భర్తలు. అందంగా కనపడాలనే తపనతో దివ్య ఎప్పుడూ లిపిస్టిక్ వేసుకునేది. ఓ టాటూ కూడా వేయించుకుంది. ఈ పద్ధతులు నచ్చని ఉమేశ్ ఆమెతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్ వేశారు. మంగళవారం ఇద్దరూ విచారణకు హాజరుకాగా ఇకపై అనుమానించనని దివ్యను ఉమేశ్ నమ్మించాడు. భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య స్థానిక ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. అయితే ఆమెను హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేశ్.. దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా ఉమేశ్, మరొకరి కోసం గాలిస్తున్నారు.
Also read
- India Pak War Live: జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత
- జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత.. డ్రోన్ దాడులకు పాక్ యత్నం
- ఇస్రో కేంద్రాల వద్ద హై అలెర్ట్.. పాక్ దాడుల నేపథ్యంలో శ్రీహరి కోట భద్రత కట్టుదిట్టం.
- Tirumala Temple: తిరుమలలో హై అలెర్ట్.. టెంపుల్ టౌన్ లో ఏరియా డామినేషన్ పై ఫోకస్.
- 400 టర్కిష్ డ్రోన్లతో భారత్‌పై దాడి! ఆ డ్రోన్లు పాక్‌కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్? పూర్తి వివరాలు