March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఎంతకు తెగించావ్రా.. తన కంటే ఎక్కువ కల్లు గీస్తుండని.. పురుగుల మందు కలిపాడు!


తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో  గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే  కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి

తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో  గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే  కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంం, జీళ్లచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. మొక్క వీరబాబు, ఐతగాని రమేష్‌ ఇద్దరు గీతకార్మికులు. ఇద్దరు చాలా ఏళ్తుగా కల్లుగీస్తున్నారు.  అయితే వీరిద్దరి మధ్య ఇటీవల కల్లు అమ్మకంలో విబేధాలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు వీరబాబు గీసే చెట్ల నుంచి ఎక్కువగా కల్లు పారుతుండటం, తో రమేశ్ అతనిపై అక్కస్సు పెంచుకున్నాడు

ఎలాగైనా వీరబాబును నష్టపరచాలని అనుకున్నాడు.  దీంతో ఓ స్కెచ్ వేశాడు.  2025 ఫిబ్రవరి 06వ తేదీన ఎవరూ లేని టైమ్ చూసి వీరబాబు గీసే తాటి చెట్టు ఎక్కిన రమేష్..  గొలకు కట్టిన మూడు లొట్టిలో పురుగుమందు కలిపాడు. మరుసటి రోజు ఉదయం వీరబాబు చెట్టు ఎక్కగా కల్లు పురుగుల మందు వాసన వచ్చింది.  ఏంటని  పురుగుల మందు కలిపినట్టు తెలిసింది. దీంతో వీరబాబు వెంటనే ఆ మూడు లొట్టిలను  తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తనకు రమేశ్ మీద అనుమానం ఉన్నట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూసుమంచి పోలీసులు రమేశ్ ను అదుపు లోకి తీసుకుని విచారించారు. దీంతో తానే పురుగుల మందు కలిపినట్టుగా ఒపుకున్నాడు. మంగళవారం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  తనకు అనుమానం రాకపోయినా, మందు కలిసిన కల్లు ఎవరికైనా పోసినా పెను ప్రమాదం జరిగేదని వీరబాబు వాపోయాడు. 

వ్యక్తి అదృశ్యం
ఇక ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కందిమళ్ల నవీన్ కుమార్ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. నవీన్ కుమార్ భార్య బంధువులకు, చుట్టుపక్కల వారిని విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.

Also read

Related posts

Share via