July 1, 2024
SGSTV NEWS
CrimeNational

కాలేజీ హాస్టల్లో హర్షిత.. తలుపులు కొడుతున్నా తీయకపోయే సరికి

ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ.. కాలేజీ హాస్టల్లో ఉంటుంది హర్షిత. ఓ రోజు తన పక్క గదిలో ఉండే ప్రగతి.. హర్షిత రూంకి వెళ్లింది. ఆమె గది తలుపులు మూసివేయడంతో..



పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతుంటారు తల్లిదండ్రులు. వారు బాగా చదువుకుని, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని ఆశ పడుతుంటారు. అందుకే బిడ్డలు తాము ఏదీ చదువుకుంటామంటే.. అదే చదివిస్తున్నారు. దూర భారాలైనా, రూపాయి ఖర్చుతో కూడుకున్నది అయినా, తలకు మించిన భారం అని తెలిసి కూడా పిల్లలు, వారి ఆనందం కోసం తమ సమస్యలను పట్టిబిగువున దిగమింగుకుంటున్నారు పేరెంట్స్. అయితే విద్యా సంస్థలపై నమ్మకంతో పిల్లల్ని బడులకు, కాలేజీలకు పంపిస్తున్నారు. విద్యా బుద్దులు నేర్పి.. మంచి పౌరులుగా, ఉద్యోగస్థులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు.. స్టూడెంట్స్ పట్ల యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని కాలేజీ యాజమాన్యం బలి తీసుకుంది.


ఇంజనీరింగ్ చదివి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుందనుకున్న కూతురు.. కాలేజీ హాస్టల్లో శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరు శివార్లలోని చందాపూర్‌లో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థులు ఆమె బలవన్మరణానికి పాల్పడిన తీరు చూసి భయాందోళనకు గురయ్యారు. హాసన్ జిల్లా అరసీకెరె తాలూకాలోని కరాడిహళ్లి గ్రామానికి చెందిన హర్షిత అనే విద్యార్థిని హీలాలీలోని బీసీఈటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతోంది. కాలేజీకి కాస్త దూరంగా చందాపూర్‌లోని హాస్టల్లో ఉంటోంది. అయితే తన పక్క రూంలో ఉండే ప్రగతి అనే విద్యార్థి.. హర్షిత కోసం ఆమె గదికి వెళ్లింది. డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి.

వెంటనే తలుపులు కొట్టింది. ఎంత అరిచినా కూడా డోర్స్ తీయకపోవడంతో అనుమానం వచ్చి స్టూల్‌పైకి ఎక్కి కిటికీలోంచి చూసింది. ఈ సమయంలో హర్షిత ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే పక్కనే ఉన్న గదిలోని విద్యార్థులు కలిసి హర్షిత గది తలుపులు పగులగొట్టి.. ఉరి నుండి ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్షిత మృతి చెందిందని వైద్యులు నిర్దారించారు. కాగా, హర్షిత గది తలుపులు ఎందుకు పగుల గొట్టారంటూ భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ ప్రశ్నించగా.. ప్రాణం కన్నా కాలేజీ ఆస్తి ముఖ్యం అయ్యిందా అని తోటి విద్యార్థులు కాలేజీ ఆవరణలో కాలేజీ యజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది వేధింపులతో విసిగిపోయిన హర్షిత ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం హర్షితను చాలా కాలంగా వేధిస్తోందని, ఈ కారణంగానే హర్షిత ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతున్నారు

Also read

Related posts

Share via