SGSTV NEWS online
Andhra Pradesh

శిక్షకైనా సిద్ధం.. నా వాదన వినండి.. పవన్ కళ్యాణ్ కు బాధితురాలి బహిరంగ సవాల్





Harsha Veena Selfie Video:ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలి హర్షవీణ.. తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని ఆమె బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ వీడియో డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లేలా చూడాలని ఆమె ప్రజలను, సోషల్ మీడియా వేదికలను కోరారు.

హర్షవీణ తన వీడియోలో స్థానిక జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్కు, తనకు మధ్య ఉన్న వ్యక్తిగత విషయాన్ని నాగేంద్ర అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. శ్రీధర్ వైపు న్యాయం లేదు కాబట్టే.. నాగేంద్ర అసంబంధిత విషయాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో శ్రీధర్ తరపున ఆయన తల్లిదండ్రులు మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.

అరవ శ్రీధర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా.. ప్రభుత్వ విప్స్ ఉన్నందునే చట్టం నుండి తప్పించుకుంటున్నారని.. ఒకవేళ ఆయన సాధారణ వ్యక్తి అయి ఉంటే ఇప్పటికే రిమాండ్లో ఉండేవారని హర్షవీణ వ్యాఖ్యానించారు. అధికార బలంతో తనపై అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న శాఖలోనే ఉద్యోగిని అని గుర్తు చేస్తూ.. తన శాఖా మంత్రిగా ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.




ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను పవన్ కళ్యాణ్కు స్వయంగా వివరించాలని ఆమె కోరుతున్నారు. ఒకవేళ విచారణలో తనది తప్పని తేలితే.. ప్రభుత్వం విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని హర్షవీణ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి.. తనకు అపాయింట్మెంట్ ఇచ్చి బాధితురాలిగా తన వాదనను వినాలని ఆమె వేడుకున్నారు.

Also read

Related posts