హైదరాబాద్: నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్గరి సీపీ సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. దీంతో, సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు.. వేధింపులకు గురి చేశారు. వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్నీ వేధింపులకు గురిచేశారు. అనంతరం, దాదాపు 40 మంది పొకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మల్కాజ్గరి సీపీ సుమతి తన మార్క్ చూపించారు. దిల్సుఖ్నగర్లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీపీ సుమతి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారి సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. ‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించారు. దీంతో, దాదాపు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్పెషల్ ఆపరేషన్లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులు కావడం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులు
డిలీషుక్ నగర్ మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్గరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్
కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు
అర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్…
Also read
- Kumkuma : కుంకుమ కింద పడితే అశుభం కాదా?
- జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఏమవుతుంది? శుభం లేదా అశుభం.. షాకింగ్ నిజాలు!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
- ఓరి దుర్మార్గుడా.. భార్యతో గొడవ వద్దన్నందుకు దాడి చేశాడు.. చివరకు





