April 11, 2025
SGSTV NEWS
Crime


గురుకుల కళాశాల విద్యార్థినిపై వేధింపులు

డ్రాయింగ్‌ టీచర్‌ విద్యార్థినిని వేధిస్తు న్నాడన్న ఆరోపణలపై కెఆర్‌ పురం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పీవీఎస్‌ నాయుడు శుక్రవారం బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విచారణ చేశారు

బుట్టాయగూడెం, సెప్టెంబరు 27 : డ్రాయింగ్‌ టీచర్‌ విద్యార్థినిని వేధిస్తు న్నాడన్న ఆరోపణలపై కెఆర్‌ పురం ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పీవీఎస్‌ నాయుడు శుక్రవారం బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విచారణ చేశారు. జీలుగుమిల్లి మండలానికి చెందిన విద్యార్ధిని బూసరాజుపల్లి గురు కుల కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్‌ చదువుతుంది. ఇదే కాలేజిలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి జె.మురళి కృష్ణ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు సర్దిచెప్పి కళాశాలకు పంపించారు. రెండు నెలలు క్రితం విద్యార్థిని తండ్రి చనిపోవడంతో దానిని అలుసుగా తీసుకున్న ఉద్యోగి మరింతగా వేధించడంతో కాళాశాల నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆగ్రహించిన తల్లి, బంధువులు అసభ్య ప్రవర్తన, వేధింపులపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాలలో డీడీ ప్రాథమికంగా విచా రణ చేశారు. విషయాన్ని ఐటీడీఏ పీవో, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు. పూర్తి నివేదికను అధికారులకు పంపుతా మన్నారు. ఐటీడీఏ డీవైఈవో నీలయ్య, ఏటీడబ్ల్యువో శ్రీవిద్య, ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మీ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గామహేశ్వరావు తెలిపారు.

కఠిన చర్యలు తీసుకోవాలి : బొరగం శ్రీనివాస్‌

విద్యార్థిని వేదించిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. విషయం తెలు సుకుని ఆయన కళాశాలను సందర్శించి ఎటిడబ్ల్యువో శ్రీవిద్య, ప్రిన్సిపాల్‌ విజ యలక్ష్మీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలన్నారు. విద్యార్దిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలి : పీడీఎస్‌యూ

ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రించిన ప్రిన్సిపాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు భూషణం,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ డిమాండ్‌ చేశారు. బాలికల కళాశాలలో మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియ మించాలన్నారు. జువైనల్‌ జస్టిస్‌ తీర్పును రద్దు చేయాలని కోరారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు

Also read

Related posts

Share via