నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ భవానీ నగర్కు చెందిన డిగ్రీ విద్యార్ధిని పూర్ణిమ.. మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి రాగానే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధిస్తున్నాడని, అతని వేధింపులు తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని జవహర్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన కుటుంబసభ్యులు.. ఆందోళనకు దిగారు. తమ కుమార్తె మరణానికి కారణమైన యువకుడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025