హుజూరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్కు చెందిన కిల్లి కుమారస్వామి, వసంత కూతురు వరుణ్య (18) హన్మకొండలోని మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అజయ్ (19) మూడేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన వరుణప్రియ తల్లిదండ్రులు అజయ్ను మందలించినా.. అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కుమారస్వామి కూతురు వరుణ్ ప్రియను.. ఆమె అమ్మమ్మ ఇల్లున్న పెద్దపాపయ్యపల్లిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంట్లో అందరూ వ్యవసాయ పనులకు వెళ్లారు. వారు వచ్చి చూసేసరికే వరుణ్య ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. అజయ్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ సీఐ తిరుమలౌడ్ తెలిపారు.
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





