👉 ఇబ్రహీంపట్నం గురునానక్
👉ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన
👉ఆందోళనకు దిగిన ఎస్ఎఫ్ఎ విద్యార్థి సంఘం
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్ కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెల్లికి చెందిన ఆలూరి భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాల హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యారీనులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన మాత్రమే ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ.. శనివారం తన గదిలోని ఫ్యాన్కు ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి విద్యార్థినులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలేజీ వద్ద ఉద్రిక్తత
విద్యార్థిని భావన ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఎ నేతలు గేట్లు దూకి లోపలికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఏసీపీ రాజు, సీఐ జగదీశ్లు అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మహత్యలకు అడ్డాగా మారింది
గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు